Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ire Vs Ind Match Prediction 2nd T20i Playing11

IRE vs IND: టీమిండియా కీలక ఆటగాడిపై వేటు.. అతడికి ఛాన్స్..?

Published Date :August 19, 2023 , 3:03 pm
By NTV WebDesk
IRE vs IND: టీమిండియా కీలక ఆటగాడిపై వేటు.. అతడికి ఛాన్స్..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఐర్లాండ్‌ సిరీస్‌పై కన్నేసింది. రేపు (ఆదివారం) డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండిమా భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇ​క రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్‌దీప్‌ సింగ్‌పై వేటు వేయాలని టీమిండియా మెనెజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read Also: Wildfire: హవాయి దాటి వాషింగ్టన్‌ వైపు కార్చిచ్చు

అతడి స్ధానంలో మరో పేసర్‌ అవేష్‌ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్‌ తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ జితీష్‌ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే మాత్రం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్‌ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు టాక్. ఆల్‌రౌండర్‌ డాక్రెల్‌ స్ధానంలో గ్రెత్‌ డెలానీకి ఛాన్స్‌ ఇవ్వాలని ఐరీష్‌ టీమ్ మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.

Read Also: African Swine Flu: కేరళలో స్వైన్‌ఫ్లూ కలకలం.. పందులను చంపాలని ఆదేశం

అయితే, టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ అదిరిపోయింది. తొలి మ్యాచ్ ను సునాయాసంగా గెలిచి, ఆ విజయాన్ని తమ ఖాతాలో టీమిండియా వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా కూడా సునాయాసంగానే దానిని చేధించింది. మొదట చాలా ఈజీగా గెలుస్తారు అనిపించినా, మధ్యలో జైశ్వాల్, తిలక్ వర్మలు వెంట వెంటనే పెవీలియన్ కి చేరడంతో కాస్త ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ, చివరకు విజయం మాత్రం భారత్ కే దక్కింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2nd T20I
  • IRE vs IND
  • Match Prediction
  • Playing11
  • Team India

తాజావార్తలు

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions