వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్‌పై కన్నేసింది. రేపు (ఆదివారం) డబ్లిన్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండిమా భావిస్తోంది. ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20లో టీమిండియా ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టీ20లో విఫలమైన అర్ష్‌దీప్ సింగ్‌పై వేటు వేయాలని టీమిండియా మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: Wildfire: హవాయి దాటి వాషింగ్టన్ వైపు కార్చిచ్చు
అతడి స్ధానంలో మరో పేసర్ అవేష్ ఖాన్‌కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా తొలి మ్యాచ్‌లో అర్ష్‌దీప్ తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఇక బ్యాటింగ్‌లో టీమిండియా ఎటువంటి మార్పులు చేసే ఛాన్స్ లేదు. ఒకవేళ జితీష్ శర్మకు అవకాశం ఇవ్వాలనకుంటే మాత్రం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా తమ జట్టులో ఒకే ఒక మార్పు చేయనున్నట్లు టాక్. ఆల్‌రౌండర్ డాక్రెల్ స్ధానంలో గ్రెత్ డెలానీకి ఛాన్స్ ఇవ్వాలని ఐరీష్ టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇక ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పుకొచ్చారు.
Read Also: African Swine Flu: కేరళలో స్వైన్‌ఫ్లూ కలకలం.. పందులను చంపాలని ఆదేశం
అయితే, టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ అదిరిపోయింది. తొలి మ్యాచ్ ను సునాయాసంగా గెలిచి, ఆ విజయాన్ని తమ ఖాతాలో టీమిండియా వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా కూడా సునాయాసంగానే దానిని చేధించింది. మొదట చాలా ఈజీగా గెలుస్తారు అనిపించినా, మధ్యలో జైశ్వాల్, తిలక్ వర్మలు వెంట వెంటనే పెవీలియన్ కి చేరడంతో కాస్త ఫ్యాన్స్ కంగారు పడ్డారు. కానీ, చివరకు విజయం మాత్రం భారత్ కే దక్కింది.