IND vs IRE: ఐర్లాండ్‌తో తొలి టీ20.. శాంసన్ స్థానంలో సిక్సర్ల కింగ్! భారత తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs IRE for 1st T20I 2023: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత్ సిద్ధమవుతోంది. సీనియర్ ప్లేయర్స్ లేకుండానే శుక్రవారం (ఆగష్టు 18) ఆరంభమయ్యే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్ కోసం జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరింది. భారత జట్టులోని చాలా మంది కొత్త ఆటగాళ్లే. దాదాపుగా ఈ ప్లేయర్స్ వచ్చే నెల ఆరంభమయ్యే ఆసియా క్రీడలు 2023 తలపడే జట్టులోనూ ఉండనున్నారు. దాంతో ఐర్లాండ్‌తో మొదటి మ్యాచ్‌కు జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందరిలో నెలకొంది.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 శుక్రవారం రాత్రి 7.30కు డబ్లిన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు ధాటిగా పరుగులు చేస్తారన్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో విండీస్ టీ20 సిరీస్‌లో అదరగొట్టిన తిలక్ వర్మ ఆడనున్నాడు. నాలుగో స్థానంలో ఆల్‌రౌండర్ శివమ్ దుబే ఆడతాడు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్ తరపున దుబే ఆడనున్నాడు.
Also Read
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ఇక ఐదో స్థానంలో సంజు శాంసన్‌కు బదులుగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జితేశ్ శర్మ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెస్టిండీస్‌పై శాంసన్ వరుసగా 12, 7, 13 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ల వెనుక కూడా పెద్దగా రాణించలేదు. ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో సిరీస్‌లో జితేశ్‌ను ఆడించేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్ తరపున జితేశ్ ఆకట్టుకున్నాడు. ఆసియా క్రీడల్లో జితేశ్‌ను ఆడించేందుకు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో.. అతనికి అంతర్జాతీయ అనుభవం కోసం ఐర్లాండ్‌పై ఆడించొచ్చు.
యువ క్రికెటర్ రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఆరో స్థానంలో అతడు బరిలోకి దిగుతాడు. ఐపీఎల్ 2023లో రింకూ 450 రన్స్ చేశాడు. 7, 8 స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. బౌలింగ్ కోటాలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రాలు ఉంటారు. ఒకవేళ సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటే.. రింకు సింగ్, జితేశ్ శర్మలో ఒకరు బెంచ్‌కే పరిమితమవుతారు. చూడాలి మరి మేనేజ్‌మెంట్ ఎవరివైపు మొగ్గు చూపిస్తుందో.
భారత తుది జట్టు (అంచనా):
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివం దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..