NTV Telugu Site icon

Arunachal Pradesh Trip: అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నారా?..ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ట్రై చేయండి

Arunachal Pradesh

Arunachal Pradesh

అరుణాచల్ ప్రదేశ్ భారత ఉపఖండంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో ఒకటి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ హిల్ స్టేషన్లు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ యొక్క ప్రధాన శిఖరం కాంగ్టో. ఈ శిఖరం సగటు సముద్ర మట్టానికి 7,060 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆహ్లదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి దాదాపు ఏడాది పొడవునా పర్యటకులు అరుణాచల్ ప్రదేశ్‌కు వస్తుంటారు. తాజాగా ఈ అందమైన ప్రదేశాన్ని వీక్షించేందుకు ఐఆర్‌సీటీసీ ఓ సువర్ణావకాశాన్ని అందించింది. అరుణాచలం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని తెలియజేస్తూ..ఐఆర్‌సీటీసీ ట్వీట్‌ చేసింది.

READ MORE: Hyderabad: రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఇద్దరు యువకులు మృతి

ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు…
ప్యాకేజీ పేరు- అరుణాచల్ ఎక్స్‌పెడిషన్ బై రైల్ ఎక్స్-ఎన్‌జెపి
ప్యాకేజీ వ్యవధి- 7 రాత్రులు, 8 రోజులు
ప్రయాణ విధానం- రైలు, రోడ్డు
ప్రాంతాలు- గౌహతి, తేజ్‌పూర్, కాజిరంగా, దిరాంగ్, తవాంగ్

READ MORE:Couple Suicide: ‘పిల్లలను బాగా చూసుకోలేకపోయాం..’ సూసైడ్ నోట్ రాసి దంపతులు ఆత్మహత్య

మీకు ఈ సౌకర్యం లభిస్తుంది..
1. ప్రయాణానికి రైలు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి.
2. బస చేయడానికి హోటల్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.
3. ఈ టూర్ ప్యాకేజీలో అల్పాహారం,రాత్రి భోజనం అందుబాటులో ఉంటుంది.
4. మీరు ప్రయాణ బీమా సౌకర్యం కూడా పొందుతారు.
5. ఈ ట్రిప్‌లో మీరు ఒంటరిగా ప్రయాణించినట్లయితే.. రూ. 48,280 చెల్లించాలి.
6 . ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరికి రూ.36,740 చెల్లించాల్సి ఉంటుంది.
7. ముగ్గురైతే ఒక్కొక్కరికి రూ.34,310 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
8. పిల్లలకు ప్రత్యేక ఫీజు ఉంది. బెడ్‌తో కలిపి (5-11 ఏళ్లు) రూ.29,060 చెల్లించాల్సి ఉంటుంది.

READ MORE:Ayodhya Rape Case: 12 ఏళ్ల బాలిక కడుపులో 12 వారాల పాప..నిందితుడి ఇంటికి బుల్‌డోజర్‌!

ఎలా బుక్ చేయాలి..
ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.