NTV Telugu Site icon

Ayatollah Khamene: ఇజ్రాయిల్‌ దాడిపై ఎలా ప్రతిస్పందించాలో మా అధికారులు నిర్ణయిస్తారు..

Ayatollah Khamene

Ayatollah Khamene

Ayatollah Khamene: ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. వందకు పైగా ఫైటర్ జెట్లతో ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ పరిణామాలు మరోసారి మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్ పెంచాయి. తాము నిర్దిష్ట లక్ష్యాలపై మాత్రమే దాడి చేసినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఈ దాడికి తప్పకుండా ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

Read Also: Bhumana Karunakar Reddy: షర్మిల వ్యాఖ్యలు సరికాదు.. భూమన రియాక్షన్

తాజాగా, ఈ దాడిపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. ఇజ్రాయిల్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనే దానిని ఇరాన్ అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. ‘‘రెండు రోజుల క్రితం జియోనిస్ట్ పాలన(ఇజ్రాయిల్) చేసిన దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు.’’ అని ఖమేనీ అన్నారు. ఈ దాడిలో తమ సైనికులు ఇద్దరు మాత్రమే చనిపోయారని ఇరాన్ పేర్కొంది. ఇరాన్‌పై దాడిని సిరియా, సౌదీ అరేబియా ఖండించాయి. టెహ్రాన్‌లోని క్షిపణి కర్మాగారాలు, ఫ్యూయల్ మిక్సింగ్ ఫెసిలిటీలపై దాడి చేసినట్లు పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.