Site icon NTV Telugu

US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు

Usiran

Usiran

అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. దీంతో రాయబార కార్యాలయంలో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య దగ్గర నుంచి ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. ఆది, సోమ, మంగళవారం వరుస దాడులతో విరుచుకుపడుతోంది. గల్ఫ్ దేశాలనే ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. కువైట్, రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి.

డ్రోన్, క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది.  దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి చేయడంతో అగ్నిప్రమాదం జరిగింది. కానీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. రాయబార కార్యాలయ సిబ్బంది సురక్షితంగా ఉన్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ధృవీకరించారు.

మంగళవారం తెల్లవారుజామున రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ రెండు డ్రోన్లు దాడి చేయడంతో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భవనానికి స్వల్ప నష్టం వాటిల్లిందని పేర్కొంది. ప్రజలెవరూ రాయబార కార్యాలయాలకు రావొద్దని సూచించింది. భారీగా మంటలు వ్యాపించాయని.. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.

 

 

Exit mobile version