Condom Sales Iran Crisis: దేశాల మధ్య యుద్ధాలు సంభవిస్తే ప్రజలు ప్రాణభయాలతో పరుగులు పెడతారని అనుకోవడం సహజం. కానీ ఇక్కడ పరిస్థితి విచిత్రంగా తయారు అయ్యింది. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా.. జూన్‌లో 12 రోజుల పాటు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో ఇరాన్ ప్రజలు ఆయుధాల నుంచి రక్షణ కోసం కాకుండా, వైద్య రక్షణ కోసం తేగ ఇబ్బంది పడ్డారని నివేదికలు వెలువడ్డాయి. ఈ విచిత్ర నివేదికలను టెహ్రాన్ ఆన్‌లైన్ మార్కెట్లు వెల్లడించాయి. ఇంతకీ ఏంటా ఇబ్బంది అనుకుంటున్నారు..
READ ALSO: Khalistani terrorist: “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది”.. అజిత్ దోవల్‌కు టెర్రరిస్టు బెదిరింపులు..
యుద్ధ సమయంలో రికార్డ్ స్థాయిలో కండోమ్స్ కొనుగోలు..
ఇరాన్‌లోని అతిపెద్ద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ డిజికల నివేదిక ప్రకారం.. యుద్ధ సమయంలో దేశంలో కండోమ్ కొనుగోళ్లు 26 శాతం పెరిగాయని తాజాగా వెల్లడించింది. ఇజ్రాయెల్ ఇరాన్ గడ్డపై క్షిపణుల వర్షం కురిపించడంతో సాధారణ ప్రజలు శానిటరీ ప్యాడ్‌లు, హ్యాండ్ శానిటైజర్, బ్లడ్ షుగర్ మానిటర్లు, మెడికల్ బ్యాండేజీలు, వయోజన డైపర్లు, అండర్ ప్యాడ్‌లు వంటి ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్ మార్కెట్‌లకు తరలివచ్చారు. అయితే వీటిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కండోమ్ అమ్మకాలలో నిరంతర పెరుగుదల కనిపించడం సదరు సంస్థ పేర్కొంది. అనిశ్చితి మధ్య అత్యధికంగా కొనుగోలు చేసిన వస్తువులలో కండోమ్‌లు అగ్రభాగంలో ఉన్నాయని వెల్లడించింది.
యుద్ధ సమయాల్లో ప్రజలు ప్రాథమిక అవసరాలు, వ్యక్తిగత భద్రతా సామగ్రిని ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆరోగ్య ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ ఇక్కడ అకస్మాత్తుగా కండోమ్‌లకు డిమాండ్ పెరగడం ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేయడం ప్రారంభించినప్పుడు, ఈ వస్తువుల అమ్మకాలు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో విశేషంగా పెరిగాయని చెప్పింది. 12 రోజుల సంఘర్షణ సమయంలో వైద్య సామగ్రితో పాటు కండోమ్‌లను కూడా విస్తృతంగా కొనుగోలు చేశారు ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. ఇది కేవలం ఇరాన్‌లో మాత్రమే జరిగిందని కాదని, సంక్షోభ సమయాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎక్కడ యుద్ధం జరిగినా..
ఈ సమాచారం ఇరాన్ వెబ్‌సైట్ ఇరాన్ ఇంటెల్‌లో ప్రచురితమైన నివేదికలో వెల్లడైంది. అయితే అక్టోబర్ 2006లో ఉత్తర కొరియా అణు పరీక్ష తర్వాత.. ఈ దేశంలో రోజుకు సగటున 1,930 కండోమ్‌లు అమ్ముడవడం ప్రారంభమైంది. అయితే అంతకుముందు ఈ సంఖ్య 1,508 మాత్రమే ఉందని నివేదికలు తెలిపాయి. మార్చి 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యన్ ఫార్మసీ చైన్ రిగ్లాలో కండోమ్‌ల అమ్మకాలు గతంతో పోల్చితే 26 శాతం మేర పెరిగాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అమ్మకాలలో వైల్డ్‌బెర్రీస్ కండోమ్ 170 శాతం పెరుగుదలను నమోదు చేసింది. యుద్ధం మాత్రమే కాదండోయ్ కోవిడ్-19 మహమ్మారి ప్రారంభ రోజుల్లో అమెరికాలోని రెకిట్ బెంకిజర్ వంటి కంపెనీలు కండోమ్ అమ్మకాలలో రికార్డులు సృష్టించాయని నివేదికలు స్పష్టం చేశాయి.
READ ALSO: Puri Sethupathi : ఎట్టకేలకు టైటిల్ చెప్పేస్తున్నారు !