Iran Conflict: ఇరాన్ సుప్రీం లీడర్ ఆఫీసు లక్ష్యంగా దాడి.. టెహ్రాన్ నడిబొడ్డున భీకర యుద్ధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Conflict: ఇరాన్ దేశ రాజధాని టెహ్రాన్ నడిబొడ్డున అత్యంత రక్షణ ఉండే ప్రభుత్వ ప్రాంతంలో ఊహించని యుద్ధం జరిగింది. ఇరాన్ సైన్యం (IRGC), ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న MEK గ్రూపు సభ్యుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం ఉండే మోతహరి కాంప్లెక్స్‌లోకి చొరబడి ఆపరేషన్ నిర్వహించాలని ముజాహిదీన్-ఎ-ఖల్క్ యోధులు (MEK) ప్రయత్నించారు. ఆ సమయంలో ఖమేనీకి విధేయులైన సైన్యం (IRGC) వారిని అడ్డుకోవడంతో భారీ కాల్పులు జరిగాయి. ఈ దాడిలో సుమారు 100 మంది MEK సభ్యులు మరణించినట్లు ఇరాన్ ప్రకటించింది.
READ ALSO: మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఈ ఘర్షణలు జరిగిన మోతహరి కాంప్లెక్స్ ఇరాన్‌లోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశం. ఇక్కడ సుప్రీం లీడర్ ఖమేనీ ఆఫీసు ఉంటుంది. దాంతో పాటు ఇరాన్ నిఘా సంస్థ, న్యాయవ్యవస్థ కార్యాలయాలు ఉన్నాయి. ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఇల్లు, కార్యాలయం కూడా ఇక్కడే ఉన్నాయి. MEK సభ్యులు విదేశీ నిఘా సంస్థల సాయంతో దాడికి ప్లాన్ చేశారని, కానీ సైన్యం ఆ దాడిని ముందే పసిగట్టి వారిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది. ఇది వారి వైఫల్యమని ఎద్దేవా చేసింది. తాము చేసిన ఆపరేషన్ విజయవంతమైందని, తమ సభ్యులు 100 మందికి పైగా అమరులయ్యారని ఆ గ్రూపు ప్రకటించింది. అయితే తమ సభ్యులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులు కూడా చాలా మంది చనిపోయారని వారు పేర్కొన్నారు. ఈ ఘర్షణల తర్వాత మరణించిన వారి పేర్లను, అరెస్ట్ అయిన వారి వివరాలను MEK గ్రూపు ఐక్యరాజ్యసమితి (UN) మరియు మానవ హక్కుల సంస్థలకు అందజేసింది. ‘అల్-అఖ్బర్’ వంటి అంతర్జాతీయ పత్రికలు దీనిని ఇరాన్‌లో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్‌గా వర్ణించాయి. ఈ తాజా ఘర్షణలు ఇరాన్ అంతర్గత భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయని అన్నాయి.
READ ALSO: The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!