Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు కీలక రవాణా మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్ ఒక సంచలన వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ అండర్ సీ (సముద్రగర్భ) ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్ కేబుల్స్‌పై “ట్రాన్సిట్ ఫీజు” (రవాణా రుసుము) వసూలు చేసే అవకాశాలను టెహ్రాన్ పరిశీలిస్తోంది. దీని ద్వారా భారీగా ఆదాయాన్ని గడించడంతో పాటు, విదేశీ ప్రత్యర్థులపై రాజకీయ, డిజిటల్ పట్టు సాధించాలని ఇరాన్ భావిస్తోంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు చెందిన తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం.. అంతర్జాతీయ కేబుల్ ఆపరేటర్లపై ఇరాన్ ఈ డిజిటల్ పన్నును విధించనుంది. దీనివల్ల గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలు ఇరాన్ నిర్దేశించిన నిబంధనలకు లోబడి పనిచేయాల్సి ఉంటుంది. “మేము ఇంటర్నెట్ కేబుల్స్‌పై రుసుములను విధిస్తాము” అని ఇరాన్ సైనిక ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగరి గత వారం ‘X’ వేదికగా స్పష్టం చేశారు.
ప్రస్తుతం హర్మూజ్ జలసంధి గుండా దాదాపు ఏడు ప్రధాన జలగర్భ కేబుల్ మార్గాలు వెళుతున్నాయి. వీటిలో ఫాల్కన్ , గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ (GBI), గల్ఫ్-TGN వంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తూ ఇరాన్ ప్రాంతీయ జలాల గుండా ప్రయాణిస్తాయి. ఈ ప్లాన్ అమలులోకి వస్తే, ఆ కేబుల్స్ ద్వారా ప్రసారమయ్యే అంతర్జాతీయ డేటాను ఇరాన్ నిఘా పెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఏవైనా సంస్థలు నిబంధనలు ఉల్లంఘిస్తే.. మిలిటరీ డైవర్లు, చిన్న జలాంతర్గాములు లేదా డ్రోన్ల ద్వారా ఈ కేబుల్స్ నెట్‌వర్క్‌ను ఇరాన్ దెబ్బతీసే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
- YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
సూయజ్ కాలువ తరహాలోనే ‘డిజిటల్ టోల్’
ఈ ప్రతిపాదనను ఈజిప్ట్ దేశానికి చెందిన సూయజ్ కాలువ నౌకల టోల్ సిస్టమ్‌తో విశ్లేషకులు పోలుస్తున్నారు. సముద్ర మార్గాల ద్వారా ఈజిప్ట్ ఎలాగైతే ఆదాయాన్ని సంపాదిస్తుందో, ఇరాన్ కూడా కేబుల్స్ ద్వారా ‘డిజిటల్ టోల్ సిస్టమ్’ ఏర్పాటు చేయాలని చూస్తోంది.
We will impose fees on internet cables.
— العميد إبراهيم ذو الفقاري (@Ibrahim_alFiqar) May 9, 2026
అంతర్జాతీయ చట్టాలు ఏం చెబుతున్నాయి?
లండన్ ఎస్ఓఏఎస్ (SOAS) యూనివర్సిటీ అంతర్జాతీయ న్యాయ ప్రొఫెసర్ ఇరిని పాపనికోలోపులు సీఎన్ఎన్తో మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఉన్న కేబుల్స్ విషయంలో ఒప్పందాల ప్రకారం ఇరాన్ నడుచుకోవాలి. కానీ, కొత్తగా వేసే కేబుల్స్ విషయంలో మాత్రం తన ప్రాంతీయ సముద్ర పరిధిలో ఎలాంటి నిబంధనలు పెట్టాలనేది ఇరాన్ నిర్ణయించవచ్చు” అని తెలిపారు.
అయితే.. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం అంతర్జాతీయ రవాణా మార్గాలకు, నావిగేషన్ స్వేచ్ఛకు ప్రత్యేక రక్షణలు ఉంటాయి. అందువల్ల అంతర్జాతీయ నిబంధనలను కాదని ఇరాన్ ఈ డిజిటల్ పన్నును ఏకపక్షంగా అమలు చేయడం అంత సులువు కాదని, దీనికి అనేక చట్టపరమైన అడ్డంకులు ఎదురవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
IND vs Pak: గోల్స్ సునామీ.. పాకిస్థాన్‌పై భారత్ 19-0తో సంచలన విజయం.!
-
Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
-
iPhone Duo vs Galaxy Z Fold 8.. స్లిమ్ డిజైన్, కెమెరా, బ్యాటరీ, ధర, ఫీచర్లలో ఏది బెస్ట్? ఫుల్ క్లారిటీ ఇదిగో..
-
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
-
YS Jagan: పరీక్ష లేకుండానే 372 ఉద్యోగాలు.. ఆ తర్వాత జీవోలు ఎందుకు మార్చారు?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?