Site icon NTV Telugu

Saeed Abbas Araghchi: అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు

Iran America

Iran America

అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరఘ్చి ఆదివారం ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేయడాన్ని ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడైన అమెరికా అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా “నేరపూరిత ప్రవర్తన” కలిగి ఉందని అరఘ్చి ఆరోపించారు. “ఈ ఉదయం జరిగిన సంఘటనలు రెచ్చగొట్టేవి, దీర్ఘకాలిక పరిణామాలను కలిగి ఉంటాయి” అని ఇరాన్ విదేశాంగ మంత్రి ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

Also Read:Eatala Rajendar: హైడ్రా దుర్మాగమైన ఆలోచన.. ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు..

విదేశాంగ విధానానికి అమెరికా తూట్లు పొడిచింది.. యూఎస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది.. టెల్అవీవ్ పై భారీ స్థాయిలో ప్రతిదాడులకు సిద్ధమవుతున్నాం అని అబ్బాస్ అరఘ్చి తెలిపారు. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రెండు దశల్లో ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేసింది. ఉత్తర, మధ్య ఇజ్రాయెల్ పైకి క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడుల్లో 86 మంది గాయపడ్డట్లు సమాచారం.

Exit mobile version