Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..

  • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడి
  • దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు ధ్రువీకరణ
Iran War

Iran War

Iran War: మరోసారి మధ్యప్రాచ్యం రాజుకుంది. అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ కూడా ప్రతిదాడులతో రెచ్చిపోతోంది. ఇరాన్ కువైట్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కువైట్ లోని భారత రాయబార కార్యాలయం కూడా ధ్రువీకరించింది. భారతీయుడి మరణంపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది.

ఈ ఘటనలో మరణించిన వ్యక్తి కుటుంబానికి, అలాగే గాయపడిన వారికి సాధ్యమైనంత త్వరగా సహాయసహకారాలు అందించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. బుధవారం టెర్మినల్ 1పై ఇరాన్ దాడులు చేసింది. ప్రాణనష్టంతో పాటు విమానాశ్రయానికి నష్టం వాటిల్లింది. ఈ దాడితో కువైట్ ఎయిర్ పోర్టును మూసేసింది. ఇప్పటి వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఘటనలో గాయపడిన 63 మందిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్చినట్లు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనాద్ బుధవారం తెలిపారు.

×
×
Ad