iQOO Z10 Lite: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO భారత మార్కెట్‌లో కొత్త బడ్జెట్ 5G ఫోన్‌ను విడుదల చేసింది. iQOO Z10 Lite 5G పేరుతో వచ్చిన ఈ ఫోన్, తన ధరకే మంచి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. కేవలం రూ.9,999 ప్రారంభ ధరకే అందుబాటులోకి రాగా.. ఇది జూన్ 25 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, iQOO ఇండియా ఈ-స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తో స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
Read Also: Air India Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 202 మృతదేహాల గుర్తింపు.. 157 డెడ్‌బాడీలు అప్పగింత..
ఈ మొబైల్ లో MediaTek Dimensity 6300 6nm ప్రాసెసర్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందించనుంది. ఈ ఫోన్ 4GB/6GB/8GB RAM వేరియంట్లలో లభ్యమవుతుండగా, వర్చువల్ RAM గా అదనంగా 8GB వరకు ఉపయోగించుకోవచ్చు. 128GB లేదా 256GB స్టోరేజ్ ఆప్షన్లు లభ్యమవుతాయి. 1TB వరకు మెమరీ కార్డు సపోర్ట్ ఉంటుంది. ఫోన్ Android 15తో పాటు Funtouch OS 15పై రన్ అవుతుంది.
ఇక ఫోన్ వెనుక 50MP ప్రైమరీ కెమెరా (Sony సెన్సార్‌తో), అదనంగా 2MP డెప్త్ సెన్సార్ ఉంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. అలాగే LED ఫ్లాష్ సపోర్ట్ కూడా కలదు. ఇందులో 6000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 3.5mm ఆడియో జాక్, స్టీరియో స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బ్లూటూత్ 5.4, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 5GHz, USB Type-C వంటి ఫీచర్లు ఉన్నాయి. 5G బాండ్స్ కోసం అనేక ఫ్రీక్వెన్సీలకు సపోర్ట్ ఉంది. ఫోన్‌కు IP64 రేటింగ్ ఉండటంతో డస్ట్, వాటర్ స్ప్లాష్‌ల నుంచి రక్షణ కలిగిస్తుంది. స్టైలిష్ డిజైన్‌లో టైటానియం బ్లూ, సైబర్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
Read Also: Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?
ఇక ఈ మొబైల్ ధరల విషయానికి వస్తే.. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 9,999, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.10,999, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 12,999 లకు లభించనుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా SBI కార్డులపై రూ. 500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక మొత్తంగా చూస్తే.. iQOO Z10 Lite 5G బడ్జెట్ సెగ్మెంట్‌లో పర్ఫెక్ట్ ఆప్షన్. రూ.10,000 లోపల 5G, 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 15, స్టైలిష్ డిజైన్, స్టీరియో స్పీకర్స్ వంటి ఫీచర్లను పొందవచ్చు.