IPS Transfers: ఏపీలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్‌ల బదిలీ

Andhra Pradesh

Andhra Pradesh

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు చోటుచేసుకున్నాయి. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా సునీల్ కుమార్‌కు ఆదేశాలిచ్చింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా రిషాంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ చీఫ్‌గా అతుల్ సింగ్‌కు, శంకబ్రాత్ బాగ్చీకి ఫైర్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. టాస్క్ ఫోర్స్ ఎస్పీగానూ రిషాంత్ రెడ్డిని ప్రభుత్వం రిలీవ్ చేసింది.