NTV Telugu Site icon

IPL Retention 2025: ఢిల్లీ క్యాపిటల్స్ షాకింగ్ నిర్ణయం.. మెగా వేలంలోకి పంత్! కన్నేసిన మూడు టీమ్స్

Rishabh Pant

Rishabh Pant

ఐపీఎల్‌ 2025 మెగా వేలంకు సంబంధించి రిటెన్ష‌న్ రూల్స్‌ను ఇటీవలే బీసీసీఐ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి. ప్రాంచైజీలు తమ రిటెన్షన్‌ లిస్ట్‌ను సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్.. ఆ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది.

ఐపీఎల్ ట్రోఫీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అందని ద్రాక్షగానే మిగిలింది. ఈసారి ఎలాగైనా ట్రోఫీ దక్కించుకోవాలని చూస్తున్న డీసీ.. సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రికీ పాంటింగ్‌ను కోచ్ బాధ్యతల నుంచి, సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి తప్పించింది. వీరి స్థానాల్లో హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావులను తీసుకుంది. ఇక కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని ఢిల్లీ మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కెప్టెన్సీ మార్పుకు రిషబ్ పంత్ ఒప్పుకోలేదట. తనకే సారథ్య బాధ్యతలు కావాలని డిమాండ్ చేశాడట. పంత్ డిమాండ్‌ను డీసీ యాజమాన్యం ఒప్పుకోలేదట. దాంతో ఢిల్లీని వీడాలని పంత్ డిసైడ్ అయిపోయాడట. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Pant-Kohli: విరాట్ కోహ్లీని దాటేసిన రిషబ్‌ పంత్‌! అగ్ర స్థానంలో బుమ్రా

మెగా వేలంలోకి వస్తున్న రిషబ్ పంత్‌ను దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటికే ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. ఆర్సీబీకి ఇప్పుడు కెప్టెన్, వికెట్ కీపర్ అవసరం ఎంతో ఉంది. దినేష్ కార్తీక్ వీడ్కోలు పలకగా.. ఫాఫ్ డుప్లెసిస్‌ను రెటైన్ చేసుకునే అవకాశం లేదు. పంత్‌తో అయినా రాత మారుతుందేమో అని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు కూడా తమ జట్టుకు కెప్టెన్‌గా పంత్‌ను కొనుగోలు చేయడంలో ఆసక్తిని కలిగి ఉన్నాయని సమాచారం.