ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సీఎస్కే 63 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఓడిపోయామన్న బాధతో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్‌కు భారీ షాక్ తగిలింది. అతనికి ఐపీఎల్ నిర్వహకులు భారీగా ఫైన్ విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంతో రూ.12 లక్షల మేర జరిమానా విధించారు.
Read Also: IPL 2024: కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. తాట తీసిన సిబ్బంది.. వీడియో వైరల్
అందుకు సంబంధించి ఐపీఎల్ నిర్వాహకులు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎల్ 2024లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేటు వల్ల గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్‌కు జరిమానా విధిస్తున్నామని తెలిపింది. ఈ సీజన్ లో ఇది తొలి తప్పిదం.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనల ప్రకారం.. గిల్ కు రూ.12 లక్షల జరిమానా విధిస్తున్నాం అని ఐపీఎల్ నిర్వాహకులు పేర్కొన్నారు.
Read Also: Viral News: కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన.. కూతురు సమాధి పక్కనే తండ్రి..
కాగా.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 63 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. గుజరాత్ బ్యాటింగ్ లో కేవలం సాయి సుదర్శన్(37) తప్ప.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. గుజరాత్ టైటాన్స్ తదుపరి మ్యాచ్ ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగనుంది.
