IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి మొత్తం 10 ఫ్రాంచైజీలు తాము నిలుపుకున్న(రిటెన్షన్), విడుదల(రిలీజ్) చేసిన ఆటగాళ్ల జాబితాను మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. వాస్తవానికి బీసీసీఐ నవంబర్ 15నే తుది గడువుగా నిర్ణయించినప్పటికీ, భారత్-న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ కారణంగా దానిని నవంబర్ 17కు పొడిగించింది. ఈ రిటెన్షన్ ప్రక్రియలో పలువురు స్టార్ ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదులుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (రూ. 4 కోట్లు) ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో, అతని పేరును సీఎస్కే విడుదల జాబితాలో చేర్చింది. అలాగే చెన్నై జట్టు రూ. 14.2 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రశాంత్ వీర్‌తో పాటు మాట్ హెన్రీని కూడా తొలగించింది.
Also Read
- Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
- Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కీలక బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను (రూ. 14 కోట్లు) విడుదల చేయగా, కోల్‌కతా నైట్ రైడర్స్ రూ. 18 కోట్ల భారీ ధర పలికిన మతీషా పతిరానాతో పాటు అజింక్య రహానే, రచిన్ రవీంద్ర, ముస్తాఫిజుర్ రెహమాన్, ఉమ్రాన్ మాలిక్, ఆకాష్ దీప్, రాహుల్ త్రిపాఠి, నవదీప్ సైనీ, బ్లెస్సింగ్ ముజారబానీ సహా మొత్తం 12 మందిని జట్టు నుండి తప్పించింది.
ఇతర ప్రధాన ఫ్రాంచైజీల విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ తమ ప్రధాన పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (రూ. 12.5 కోట్లు), దీపక్ చాహర్ (రూ. 9.25 కోట్లు) సహా కేశవ్ మహారాజ్, ఏఎం గజన్ఫర్, మయాంక్ మార్కండే తదితర తొమ్మిది మందిని విడుదల చేసింది.
ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ. 11.75 కోట్లు), నితీష్ రాణా, దుష్మంత చమీరా, కరుణ్ నాయర్, పతుమ్ నిస్సంక, అభిషేక్ పోరెల్లను వదులుకుంది.
రాజస్థాన్ రాయల్స్ తమ కీలక ఆటగాళ్లు షిమ్రాన్ హెట్మెయర్ (రూ. 11 కోట్లు), తుషార్ దేశ్‌పాండే (రూ. 6.5 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ. 2.4 కోట్లు), క్వేనా మ్ఫాకా (రూ. 1.5 కోట్లు), నాండ్రే బర్గర్, కుల్దీప్ సేన్ సహా తొమ్మిది మందిని తప్పించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జాకబ్ బెథెల్ (రూ. 2.6 కోట్లు), రిచర్డ్ గ్లీసన్, మంగేష్ యాదవ్‌లను విడుదల చేయగా, లక్నో సూపర్ జెయింట్స్ ఆవేశ్ ఖాన్‌ను (రూ. 9.75 కోట్లు), గుజరాత్ టైటాన్స్ మార్క్ వుడ్, ఇషాంత్ శర్మ, షారుఖ్ ఖాన్‌లను జట్టు నుండి వదులుకున్నాయి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Indian Railways: సొంతూళ్లకు వెళ్లేవారికి రైల్వే గుడ్‌న్యూస్.. క్రిస్మస్, సంక్రాంతికి 6 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
-
Telangana Real Estate: రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ రెరా షాక్.. భారీ జరిమానాలు..
-
IPL 2027 Retention List: వేలానికి సిద్ధమైన స్టార్లు.. కోట్లు పలికిన ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు.. లిస్ట్ ఇదే..
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!