RCB vs SRH: బౌలర్లు vs బ్యాటర్లు.. ఇరు జట్లలో స్టార్ పేసర్లు దూరం.. ఓపెనింగ్‌లోనే హై వోల్టేజ్ ఫైట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ శనివారం (మార్చి 28) ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరగనుంది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో చాలా కాలం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై అందరి దృష్టి ఉంటుంది. యువ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీకి సైతం పరీక్ష ఎదురుకానుంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా, ఆరంభ మ్యాచ్‌లలో ఇషాన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే.. ఈ రెండు టీమ్‌లలో స్టార్ పేసర్లు పలు కారణాల వల్ల దూరమయ్యారు. దీంతో మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇది బ్యాటర్లకు కలిసి రానుంది.
READ MORE: Congress: ఢిల్లీ కోటలో కాంగ్రెస్ అడ్డా సేఫ్.. 24 అక్బర్ రోడ్ బంగ్లా ఇప్పుడే ఖాళీ లేదు!
Also Read
గత సీజన్ స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంకా జట్టుతో చేరలేదు. యశ్ దయాల్ సైతం పలు కారణాల వల్ల సీజన్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అనుభవజ్ఞుడైన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ ఒక్కరే మిగిలారు. కొత్తగా జట్టులోకి వచ్చిన జాకబ్ డఫీ, యువ పేసర్లు మంగేష్ యాదవ్, రాసిఖ్ సలామ్‌లు పటిష్టమైన సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడం కష్టమని నిపుణుల అంచనా. మరోవైపు.. సన్‌రైజర్స్ పరిస్థితి చూస్తే.. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా దూరమయ్యాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ, హర్షల్ ఇటీవలి కాలంలో ధారాళంగా పరుగులు ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ వంటి విధ్వంసకర బ్యాటర్లను వీరు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏం జరగుతుందో చూద్దాం.. \
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!