RCB Predicted Playing XI: తొలి మ్యాచ్‌కు ఆర్సీబీ రెడీ.. RCB కొత్త ప్లేయింగ్ XI లీక్!

Rcb

Rcb

RCB Predicted Playing XI: ఐపీఎల్‌ దగ్గర పడుతోంది. ఆరు రోజుల్లో అంటే మార్చి 28న తొలి మ్యాచ్ జగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఎం. చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. గతేడాది జూన్ 4న ఆర్‌సీబీ ట్రోఫీ పరేడ్ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో పిల్లలతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఆ స్టేడియంలో ఇప్పటి వరకు ఎలాంటి మ్యాచ్‌లు జరగలేదు. దీంతో చిన్నస్వామి స్టేడియం పిచ్ తాజాగా ఉండి.. ఈ హోరాహోరీగా సాగే మ్యాచ్‌లకు వేదిక కానుంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విషయానికి వస్తే.. కీలక ప్లేయర్స్‌ను నిలబెట్టుకుంది. అంతే కాదు.. వెంకటేష్ అయ్యర్, జాకబ్ డఫీ, జోర్డాన్ కాక్స్ వంటి స్టార్ ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుంది. విహాన్ మల్హోత్రా, కనిష్క్ చౌహాన్, మంగేష్ యాదవ్‌ల వంటి యువతపై పెట్టుబడితో పాటు ఫోకస్ పెట్టారు.

READ MORE: Dasun Shanaka-IPL 226: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!

ఇక జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. యశ్ దయాల్‌ను కొన్ని కారణాల వల్ల పక్కన దూరమవుతున్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో మంగేష్ పేరు పరిశీలనలో ఉంది. మరోవైపు.. రజత్ పాటిదార్ సారథ్యంలోని ఈ జట్టులో విరాట్ కోహ్లీ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. బౌలింగ్ విభాగంలో స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ మొదటి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో జాకబ్ డఫీ బరిలోకి దిగనున్నాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాకతో జట్టు బౌలింగ్ మరింత బలోపేతమైంది. బ్యాటింగ్‌లో దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, జితేష్ శర్మలతో మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. ఫినిషర్‌గా టిమ్ డేవిడ్, ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించనున్నారు.

ఆర్‌సీబీ అంచనా ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ దార్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ.
ఇంపాక్ట్ ప్లేయర్స్: వెంకటేష్ అయ్యర్/జాకబ్ బెథెల్ (బ్యాటింగ్), మంగేష్ యాదవ్ (బౌలింగ్).