Dasun Shanaka-IPL 2026: ఐపీఎల్ ప్రభావం.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కీలక నిర్ణయం!
- పీఎస్ఎల్‌కు మరో భారీ షాక్
- పీఎస్ఎల్ నుంచి తప్పుకున్న దసున్ షనక
- రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడే అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)కు మరో భారీ షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 కోసం పీఎస్ఎల్ నుంచి ఇప్పటికే కొందరు ప్లేయర్స్ తప్పుకోగా.. తాజాగా ఈ లిస్టులో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కూడా చేరినట్లు సమాచారం. పీఎస్ఎల్ 2026లో కాకుండా ఐపీఎల్ 2026లో ఆడాలని షనక నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక కెప్టెన్ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
2026 పీఎస్ఎల్ వేలంలో లాహోర్ ఖలందర్స్ జట్టు దసున్ షనకను పీకేఆర్ 2.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే శనక లీగ్ నుంచి తప్పుకోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. మెగా లీగ్ ఐపీఎల్ క్రేజ్ నేపథ్యంలో పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లు ఇతర లీగ్‌లను వదిలి.. ఐపీఎల్ ఆడేందుకు వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. శనక కూడా అదే దారిలో నడిచాడు. షనకపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత టోర్నీల నుంచి తప్పుకునే ఆటగాళ్లపై 2 నుంచి 4 సంవత్సరాల నిషేధం విధించడంతో పాటు భారీ జరిమానాలు విధించాలని సూచిస్తున్నారు.
Also Read
- IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
- Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
2026 మినీ వేలంలో శ్రీలంక ఆల్-రౌండర్ దాసున్ షనకను ఏ ప్రాంచైజీ కోనుగోలు చేయలేదు. ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఐపీఎల్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో ఆడాడనికి పీఎస్ఎల్ నుండి వైదొలిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ లేదా గుజరాత్ టైటాన్స్‌కు షనక ఆడే అవకాశం ఉంది. సామ్ కరన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షనక స్టార్ ఆల్‌రౌండర్. 2022 ఆసియా కప్‌లో శ్రీలంకను ఛాంపియన్‌గా నిలిపాడు. లోయర్ ఆర్డర్‌లో వేగంగా ఆడగల సామర్థ్యం, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దూకుడు బ్యాటింగ్ అతడి ప్రత్యేకత. 90కి పైగా మ్యాచ్‌లు ఆడిన షనక 1300+ పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
IND Vs WI 4th T20: ఉప్పల్లో 300 పరుగుల లోడింగ్..! సాధ్యసాధ్యాలివే..
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్‌ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!