RCB Vs SRH: టాస్ గెలిచిన ఆర్సీబీ.. బ్యాటింగ్ ఎవరిదంటే..
- ఐపీఎల్ తొలిపోరుకు సిద్ధమైన ఎస్ఆర్హెచ్ vs ఆర్సీబీ..
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..
- బ్యాంటింగ్‌కు దిగనున్న ఎస్ఆర్హెచ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్ గ్రాండ్ ఓపెనింగ్‌కు సమయం ఆసన్నమైంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తో తలపడుతున్న ఈ మ్యాచ్‌లో ఇప్పుడే టాస్ పడింది. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదటగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 2026లో మొదట బ్యాటింగ్ చేయనుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు 300 స్కోర్ లోడింగ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
రెండు జట్లు కూడా బౌలింగ్ విభాగంలో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఆర్సీబీ విషయానికి వస్తే.. స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ ఇంకా కోలుకోకపోవడం, యశ్ దయాళ్ ఈ సీజన్ మొత్తానికి దూరం కావడం జట్టుకు పెద్ద లోటు. ఇప్పుడు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తో పాటు కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మ, మంగేష్ యాదవ్‌లపైనే భారమంతా ఉంది.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
సన్‌రైజర్స్: రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. జయదేవ్ ఉనద్కత్, హర్షల్ పటేల్ వంటి బౌలర్లు బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ఎంతవరకు రాణిస్తారో చూడాలి.
బ్యాటింగ్ ధమాకా..
బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈ మ్యాచ్ పూర్తిగా బ్యాటర్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
RCB బ్యాటర్లు.. విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, జాకబ్ బెథెల్ , రొమారియో షెపర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో ఆర్సీబీ బలంగా ఉంది.
SRH బ్యాటర్లు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ , హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లతో సన్‌రైజర్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
తుది జట్లు ఇవే..
SRH: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ మలింగ.
RCB: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫ్ఫీ, సుయాష్ శర్మ.
టాస్ గెలిచిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘మేము మొదట బౌలింగ్ చేస్తాం. గత ఏడాది నుంచి మాకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. అయితే ఈ సీజన్లోకి అడుగుపెడుతున్నప్పుడు మేము ఛాంపియన్ హోదాను కాపాడుకోవడం గురించి కాకుండా.. 2026లో మళ్ళీ కొత్తగా ఛాంపియన్స్ అవ్వాలనే లక్ష్యంతో ఆడుతున్నాం. మా జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు, ప్రతి స్థానానికి సరైన ప్రత్యామ్నాయ ఆటగాళ్లు (బ్యాకప్స్) కూడా ఉన్నారు. మా మెడికల్ టీమ్, సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంది. అందరూ పూర్తి ఫిట్‌గా ఉన్నారు, ఈ మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్లుగా మాకు మద్దతు ఇస్తున్న అభిమానులకు చాలా కృతజ్ఞతలు. ఈ మ్యాచ్‌తో జేకబ్ డఫీ, అభినందన్ సింగ్ అనే ఇద్దరు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నారు’ అని అన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఈ సీజన్లో మా మొదటి మ్యాచ్ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ మేము టాస్ గెలిచినా కూడా మొదట బౌలింగ్ తీసుకునేవాళ్లం, ఎందుకంటే పిచ్ చాలా తాజాగా కనిపిస్తోంది. నిజానికి మొదట బ్యాటింగ్ చేస్తున్నామా లేదా బౌలింగ్ చేస్తున్నామా అనేది ముఖ్యం కాదు, మన నమ్మకాన్ని బట్టి ఆడటం ముఖ్యం. మా ప్లాన్ కూడా అదే. ఐపీఎల్ అని చెప్పి అనవసరంగా కొత్త ప్రయోగాలు చేయకుండా విషయాలను సింపుల్‌గా ఉంచాలనుకుంటున్నాం. ఆటగాళ్లందరికీ వారి బాధ్యతలేంటో స్పష్టంగా తెలుసు, వాటిని సరిగ్గా అమలు చేస్తే చాలు. ప్యాట్ కమిన్స్ జట్టులోనే కాదు ఐపీఎల్లో కూడా అత్యుత్తమ బౌలర్. అతను లేకపోవడం మాకు పెద్ద లోటు. కానీ ప్రస్తుతం అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మా ప్లాన్ ప్రకారం ఆడితే తప్పకుండా గెలుస్తాం. ఈ మ్యాచ్‌లో సలీల్ అరోరా ఆట చూడదగ్గదిగా ఉంటుంది. అతను మంచి టచ్‌లో ఉన్నాడు, బంతిని చూసి తన సహజ సిద్ధమైన ఆట ఆడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!