Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl 2026 Ipl 2026 Aiden Markram 32 Run Over Costs Lsg As Pbks Cruise To Big Win

LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!

Published Date :April 20, 2026 , 8:19 am
By Kothuru Ram Kumar
LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Aiden Markram Over: ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్‌ (LSG)కు ఎదురుదెబ్బలు కొనసాగుతూనే ఉన్నాయి. ముల్లాన్‌ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల భారీ తేడాతో లక్నోను చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్‌ లో లక్నో పరాజయానికి ప్రధాన కారణంగా ఎయిడెన్ మార్క్‌రమ్ వేసిన ఒకే ఒక్క ఖరీదైన ఓవర్ నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో మాత్రం మహమ్మద్ షమీ తొలి ఓవర్లోనే ప్రభ్‌ సిమ్రన్ సింగ్‌ ను గోల్డెన్ డక్‌గా ఔట్ చేసి శుభారంభం అందించాడు. కానీ ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కానొల్లి జంట లక్నో బౌలర్లపై విరుచుకుపడి మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. వీరిద్దరూ ఆడిన తీరు చూస్తే ఏదో వీడియో గేమ్ ఆడుతున్నట్టే అనిపించింది.

కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!

కెప్టెన్ రిషభ్ పంత్ తీసుకున్న బౌలింగ్ మార్పులు కూడా జట్టుకు నష్టంగా మారాయి. ముఖ్యంగా సరైన సమయంలో సరైన బౌలర్‌ ను ఉపయోగించకపోవడం తీవ్రంగా ప్రభావం చూపింది. 13వ ఓవర్లో మార్క్‌రమ్‌ ను బౌలింగ్‌ కు తీసుకురావడం మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ ఓవర్లో కూపర్ కానొల్లి వరుసగా మూడు సిక్సర్లు బాదగా.. ఆ తర్వాత వైడ్, సింగిల్ వచ్చింది. ఆపై ప్రియాన్ష్ ఆర్య మరో రెండు సిక్సర్లు కొట్టడంతో మొత్తం 32 పరుగులు వచ్చాయి. దీనితో ఈ ఓవర్ ఐపీఎల్ 2026 లోనే అత్యంత ఖరీదైన ఓవర్‌ గా నిలిచింది. అంతేకాదు ఒక ఓవర్‌లో 5 సిక్సర్లు ఇచ్చిన బౌలర్ల జాబితాలో కూడా మార్క్‌రమ్ చేరాడు.

PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

ఈ ఓవర్‌తో మ్యాచ్ పూర్తిగా పంజాబ్ వైపు మొగ్గుచూపింది. చివరకు పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 254 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ప్రియాన్ష్ ఆర్య 93 పరుగులు, కూపర్ కానొల్లి 87 పరుగులతో చెలరేగారు. అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (43), మార్ష్ (40), బదోని (35) పోరాడినప్పటికీ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖ్, చాహల్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో తొలి 6 మ్యాచ్‌ల్లో ఓటమి లేకుండా కొనసాగిన తొలి జట్టుగా నిలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aiden Markram
  • Aiden Markram expensive over
  • Cooper Connolly
  • IPL 2026
  • LSG vs PBKS

తాజావార్తలు

  • LSG కొంపముంచిన Aiden Markram ఓవర్.. IPL 2026లో అత్యంత ఖరీదైన ఓవర్ నమోదు.!

  • Hit and Run Accident: కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్.. బెంజ్ కార్ ఢీకొని యువకుడు మృతి.!

  • కళ్లు చెదిరే స్టంపింగ్‌తో MS Dhoni ని గుర్తుచేసిన Dhruv Jurel.!

  • Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ

  • PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!

ట్రెండింగ్‌

  • Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions