IPL 2025: చరిత్రకు అడుగు దూరంలో విరాట్ కోహ్లీ!
- అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు
- 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8,004 పరుగులు
- 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ప్లేయర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. ముందు బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ అయినా.. పిచ్ ఏదైనా.. బౌలర్ ఎవరైనా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 252 ఐపీఎల్ మ్యాచ్‌లలో 8,004 పరుగులు చేయగా.. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత 17 సంవత్సరాలుగా ఒకే ఫ్రాంచైజీకి నిలకడగా ఆడుతున్న ఏకైక ప్లేయర్ కూడా కోహ్లీనే. ఐపీఎల్ 2025 మార్చ్ 22 నుంచి ఆరంభం కానుండగా.. విరాట్ 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2025 ద్వారా టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించడానికి విరాట్ అడుగు దూరంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కింగ్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. పొట్టి ఫార్మాట్లో విరాట్ 9 శతకాలు బాదగా.. అందులో 8 ఐపీఎల్, ఒకటి అంతర్జాతీయ క్రికెట్లో చేశాడు. 2022లో ఆసియా కప్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్పై అంతర్జాతీయ సెంచరీ బాదాడు. కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే.. 10 టీ20 సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టిస్తాడు. మొత్తంగా అత్యధిక టీ20 సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (22) అగ్రస్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ (11) రెండో స్థానంలో ఉండగా.. విరాట్ (9) మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో బాబర్ అజామ్‌ను అధిగమించడానికి విరాట్ కోహ్లీకి మంచి సువర్ణావకాశం ఉంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కింగ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఆ జోరును ఐపీఎల్ 2025లో కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాడు. విరాట్ జూన్ 2024లో అంతర్జాతీయాల టీ20 నుండి రిటైర్ అయ్యాడు. కానీ ఐపీఎల్ టోర్నీలో మాత్రం ఆడుతున్నాడు. ఈ ఎడిషన్‌లో కొత్త రికార్డులు సృష్టించి.. బెంగళూరు టైటిల్ కరువును తీర్చాలని విరాట్ చూస్తున్నాడు. ఫాన్స్ కూడా బెంగళూరు కప్ కొట్టాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!