NTV Telugu Site icon

IPL 2025: ఐపీఎల్ 2025పై బిగ్ అప్ డేట్.. కాసేపట్లో షెడ్యూల్

Ipl 2025

Ipl 2025

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ ఈరోజు రిలీజ్ కానుంది. కొన్ని రోజులుగా కొన్ని మ్యాచ్‌ల షెడ్యూల్ గురించి నివేదికలు వస్తున్నాయి. టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరుగుతుందని.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి బ్లాక్‌బస్టర్ మ్యాచ్ చేపాక్ మైదానంలో జరుగనుంది. కాగా.. ముంబై ఇండియన్స్ మార్చి 31న తన తొలి హోమ్ మ్యాచ్ ఆడనుంది. ఈ కొన్ని మ్యాచ్‌ల అప్ డేట్ తెలిస్తేనే.. అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అయితే.. ఈ రోజు ఐపీఎల్ మొత్తం షెడ్యూల్ వెల్లడి కానుంది. స్టార్ స్పోర్ట్స్ ఈరోజు షెడ్యూల్ ప్రకటన గురించి తెలియజేసింది. ఐపీఎల్ 2025 షెడ్యూల్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం..

Read Also: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..

ఐపీఎల్ (IPL 2025) షెడ్యూల్ కాసేపట్లో ప్రకటించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు షెడ్యూల్ రిలీజ్ కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రకటిస్తారు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రత్యక్ష ప్రసారం కోసం జియో హాట్ స్టార్(JioHotstar)లో చూడవచ్చు. టీవీలో వివిధ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో పాటు Sports-18 Oneలో లైవ్ చూడవచ్చు.

Read Also: Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు