NTV Telugu Site icon

IPL 2025 Retention: సీఎస్‌కే సంచలన నిర్ణయం.. రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉందని సమాచారం. రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎమ్) ఆప్షన్‌ ఈసారి లేదట. మరికొన్ని గంటల్లో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. ఐదుగురితో కూడిన రిటెన్షన్ లిస్ట్‌ను అన్ని జట్లు సిద్ధం చేసినట్లు సమాచారం. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కూడా తమ లిస్ట్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విషయంలో సీఎస్‌కే ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025కు ధోనీ అందుబాటులో ఉంటాడా? లేదా? అనే విషయంపై ఫ్రాంచైజీకి క్లారిటీ లేకున్నా.. రిటెన్షన్‌ లిస్ట్‌ సిద్ధం చేసిందట. ధోనీ పేరు లిస్టులో ఉందట. ఐపీఎల్ 2025లో మహీ ఆడుతాడని సీఎస్‌కే నమ్మకంగా ఉందట. అందుకే అతడి పేరును రిటెన్షన్ లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం. రిటైర్మెంట్ ప్రకటించి 5 ఏళ్లు పూర్తవ్వడంతో.. ధోనీని తక్కువ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Rohit Sharma: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. రోహిత్ శర్మ సంచలన నిర్ణయం!

ఎంఎస్ ధోనీ సహా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసర్ మతీష పతిరనా, ఆల్‌రౌండర్‌ శివమ్ దూబేలను సీఎస్‌కే రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్రలు కూడా చెన్నైకి కీలక ప్లేయర్స్ అన్న విషయం తెలిసిందే. వీరిని వేలంలో తిరిగి దక్కించుకోవాలని చూస్తోందట. ఒకేవేళ ధోనీ ఆడకుంటే.. అతడి స్థానంలో కాన్వేను వికెట్ కీపర్‌గా కొనసాగించనుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.