KL Rahul: ఇక్కడ నేనే తోపు.. నా కంటే ఇంకెవరికి బాగా తెలుసు: కేఎల్ రాహుల్
- ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డీసీ విజయం
- 53 బంతుల్లో 93 పరుగులు చేసిన రాహుల్
- చిన్నస్వామి స్టేడియం గురించి నా కంటే ఇంకెవరికి బాగా తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తనకు హోం గ్రౌండ్ అని, ఈ మైదానం పరిస్థితుల గురించి తనకంటే బాగా ఇంకా ఇంకెవరికి తెలుసు? అని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బ్యాటర్ కేఎల్ రాహుల్ అన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా అని తెలిపాడు. స్టేడియం చిన్నదే అయినా.. పిచ్ మాత్రం సవాల్ విసురుతుంది అని చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన క్యాచ్‌ను వదిలేయడం కలిసొచ్చిందని రాహుల్ తెలిపాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో డీసీ గెలిచింది.
బెంగళూరు నిర్ధేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది. లోకల్ బాయ్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 93 పరుగులు చేసి బెంగళూరు పతనాన్ని శాసించాడు. అయితే 5 పరుగుల వద్ద రాహుల్ క్యాచ్‌ను రజత్ పాటీదార్ వదిలేయడంతో ఆర్సీబీ భారీ మూల్యం చెల్లించుకుంది. కడవరకు క్రీజులో నిలబడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. హోం గ్రౌండ్లో ఆడడం ఏ ఆటగాడికైనా ప్రత్యేకం అని పేర్కొన్నాడు. చిన్నస్వామి స్టేడియంలో మంచి ఇన్నింగ్స్ ఆడడం ఆనందంగా ఉందన్నాడు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Also Read: Gold Rate Today: నిన్న రూ.2940, నేడు రూ.2020.. ఇక బంగారం కొనడం కష్టమేనా?
‘చిన్నస్వామి స్టేడియం చిన్నదే అయినా.. పిచ్ మాత్రం సవాల్ విసురుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా కీపింగ్ చేయడం కూడా నాకు కలిసొచ్చింది. ఎలా ఆడాలో ముందుగానే అంచనా వేయగలిగా. బంతి ఆగుతూ వస్తుందనిపించింది. మంచి ఆరంభం దక్కితే చాలనుకున్నా. నా ఆటపై నమ్మకం ఉంది. ప్రత్యర్థికి ఏది టార్గెట్ అవుతుందనేది నాకు తెలుసు. ఇన్నింగ్స్ ఆరంభంలో పరిస్థితులకు తగ్గటు కాస్త ఆచితూచి ఆడాను. ఆరంభంలోనే క్యాచ్‌ను వదిలేయడం అదృష్టమే. ఇది నా గ్రౌండ్, నా హోమ్. నాకంటే ఇక్కడి పరిస్థితులు ఇంకెవరికి తెలుసు. చిన్నస్వామి స్టేడియంలో ఆడటాన్ని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తా. ఈరోజు ఆనందంగా ఉంది’ అని కేఎల్ రాహుల్ చెప్పాడు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!