Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Ipl 2025 Rcb Becomes The First Team In Ipl History

RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!

Published Date :April 28, 2025 , 3:36 pm
By Sampath Kumar
  • ఐపీఎల్‌ చరిత్రలోనే ఆర్సీబీ అరుదైన రికార్డు
  • ఒకే సీజన్‌లో బయటి వేదికల్లో అత్యధిక విజయాలు
  • పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఆర్సీబీ
RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి మైదానంలో వరుసగా ఆరు విజయాలు సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ టీమ్ కూడా ఈ రికార్డును సాధించలేదు.

ఐపీఎల్‌ 2025లో ఆర్సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 విజయాలు, 3 ఓటములు ఉన్నాయి. ఏడు విజయాల్లో ఆరు విజయాలు ప్రత్యర్థి వేదికల్లోనే (బయటి వేదికల్లోనే) సాధించడం విశేషం. అంతేకాదు ఒకే సీజన్‌లో బయటి వేదికల్లో అత్యధిక విజయాలు సాధించడం ఆర్సీబీకి ఇది రెండోసారి. 2015లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బయటి వేదికల్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లను గెలిచింది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లలోనే ఏకంగా 6 విజయాలు అందుకుంది. 2011, 2012లో ఐదు మ్యాచ్‌లను ఆర్సీబీ గెలిచింది.

ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. అధికారిక ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంటుంది. ఆర్సీబీ ఫామ్ చూస్తే ఇదేమీ కష్టమేమి కాదు. నాలుగు మ్యాచుల్లో రెండు గెలిస్తే టాప్-2లో నిలవడం పక్కా. ఈసారైనా కప్ కొట్టాలని ఆర్సీబీ ఫాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

Also Read: Sanjana Ganesan: నా కొడుకుతో మీకేంట్రా పని.. ఇచ్చి పడేసిన బుమ్రా వైఫ్!

ఒకే ఐపీఎల్ సీజన్‌లో బయట మైదానాల్లో ఆర్సీబీ అత్యధిక విజయాలు:
# 2015లో 6 విజయాలు (9 మ్యాచ్‌లు)
# 2025లో 6 విజయాలు (6 మ్యాచ్‌లు)
# 2011లో 5 విజయాలు (10 మ్యాచ్‌లు)
# 2012లో 5 విజయాలు (8 మ్యాచ్‌లు)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DC vs RCB
  • IPL 2025
  • RCB
  • RCB Record

తాజావార్తలు

  • Rowdy-Sheeters: హైదరాబాద్‌ పోలీసుల కీలక ఆపరేషన్‌.. 250 మంది రౌడీ షీటర్లకు డ్రగ్స్ పరీక్షలు

  • Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

  • Digital Arrest Scam: ఫ్యామిలీ మొత్తం 10 గంటల పాటు డిజిటల్ అరెస్ట్.. తన ఐడియాతో చెక్‌ పెట్టిన 8వ తరగతి విద్యార్థి.. ఖంగుతిన్న కేటుగాళ్లు

  • Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!

  • Mega Movies : మెగా ఫ్యామిలీకి VFX గండం?

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions