RCB Record: ఆర్సీబీ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి టీమ్!
- ఐపీఎల్ చరిత్రలోనే ఆర్సీబీ అరుదైన రికార్డు
- ఒకే సీజన్‌లో బయటి వేదికల్లో అత్యధిక విజయాలు
- పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది. ప్రత్యర్థి మైదానంలో వరుసగా ఆరు విజయాలు సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆర్సీబీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఏ టీమ్ కూడా ఈ రికార్డును సాధించలేదు.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 7 విజయాలు, 3 ఓటములు ఉన్నాయి. ఏడు విజయాల్లో ఆరు విజయాలు ప్రత్యర్థి వేదికల్లోనే (బయటి వేదికల్లోనే) సాధించడం విశేషం. అంతేకాదు ఒకే సీజన్‌లో బయటి వేదికల్లో అత్యధిక విజయాలు సాధించడం ఆర్సీబీకి ఇది రెండోసారి. 2015లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో బయటి వేదికల్లో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లను గెలిచింది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లలోనే ఏకంగా 6 విజయాలు అందుకుంది. 2011, 2012లో ఐదు మ్యాచ్‌లను ఆర్సీబీ గెలిచింది.
Also Read
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో 7 విజయాలతో 14 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా.. అధికారిక ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకుంటుంది. ఆర్సీబీ ఫామ్ చూస్తే ఇదేమీ కష్టమేమి కాదు. నాలుగు మ్యాచుల్లో రెండు గెలిస్తే టాప్-2లో నిలవడం పక్కా. ఈసారైనా కప్ కొట్టాలని ఆర్సీబీ ఫాన్స్ బలంగా కోరుకుంటున్నారు.
Also Read: Sanjana Ganesan: నా కొడుకుతో మీకేంట్రా పని.. ఇచ్చి పడేసిన బుమ్రా వైఫ్!
ఒకే ఐపీఎల్ సీజన్‌లో బయట మైదానాల్లో ఆర్సీబీ అత్యధిక విజయాలు:
# 2015లో 6 విజయాలు (9 మ్యాచ్‌లు)
# 2025లో 6 విజయాలు (6 మ్యాచ్‌లు)
# 2011లో 5 విజయాలు (10 మ్యాచ్‌లు)
# 2012లో 5 విజయాలు (8 మ్యాచ్‌లు)
- Tags
- DC vs RCB
- IPL 2025
- RCB
- RCB Record
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!