NTV Telugu Site icon

IPL 2025: ‘చూసేకి అగ్గి రవ్వలా…’ పాటతో.. ఐపీఎల్ 2025 షురూ..

Ipl

Ipl

ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ప్రారంభ వేడుక జరుగుతోంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ వేదికపైకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభోత్సవంలో ఎవరెవరు ప్రదర్శన ఇస్తారో ఆయన వివరించారు. నటి దిశా పటానీ వేదికపైకి అడుగుపెట్టగానే అందరినీ ఆకట్టుకుంది. తన నృత్య ప్రదర్శనతో వేదికను వెలిగించింది.

READ MORE: KKRvsRCB: 16 ఏళ్ల క్రితం కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్‌.. ఏ టీం గెలిచిందంటే?

దేశభక్తి గీతాన్ని ఆలపించిన శ్రేయా ఘోషల్‌.. విద్యాబాలన్ చిత్రం భూల్ భూలైయాలోని పాటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దీని తరువాత.. సంజు చిత్రంలోని కర్ హర్ మైదాన్ ఫతే పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సూపర్‌ హిట్‌ చిత్రమైన పుష్ప-2లోని ‘చూసేకి అగ్గి రవ్వలా…’ పాటను ఆలపించింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియం మారుమోగుతోంది. ప్రముఖ గాయకుడు, రాపర్ కరణ్ ఔజ్లా ఐపీఎల్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చారు. రాపర్ కరణ్ ఔజ్లా తన గాత్రంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. అనంతరం విరాట్ కోహ్లీ వేదిక పైకి చేరుకున్నారు. కరతాళ ధ్వనులు, కేరింతలతో ప్రేక్షకులు స్వాగతం పలికారు. ఐపీఎల్‌ ప్రారంభమైన నాటి నుంచి ఒకే టీమ్‌ (ఆర్సీబీ)కి ఆడుతున్న కోహ్లీ అంటూ అభినందించారు షారుఖ్‌.‘కోహ్లీ.. కోహ్లీ… కోహ్లీ’ అంటూ నినాదాలు చేశారు.