RCB vs GT: విజృంభించిన సిరాజ్, దంచేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం!
- విజృంభించిన సిరాజ్, దంచేసిన బట్లర్
- బెంగళూరుపై గుజరాత్ ఘన విజయం
- రూథర్‌ఫర్డ్ సూపర్ ఇన్నింగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ (49; 36 బంతుల్లో 7×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బెంగళూరు 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లివింగ్‌స్టన్ (54; 40 బంతుల్లో 1×4, 5×6) హాఫ్ సెంచరీ చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఆరంభం దక్కలేదు. సిరాజ్ చెలరేగడంతో బెంగళూరు 7 ఓవర్లలో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ కోహ్లీ (7)ని అర్షద్ ఖాన్ అవుట్ చేయగా.. పడిక్కల్ (4), ఫిల్ సాల్ట్ (14)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. రజత్ పాటిదార్ (12)ను ఇషాంత్ శర్మ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ సమయంలో లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ (33; 21 బంతుల్లో 5×4, 1×6) జట్టును ఆదుకున్నారు. 12 ఓవర్లలో 91/4తో ఆర్సీబీ కోలుకుంది. స్పిన్నర్ సాయికిశోర్ వరుస ఓవర్లలో జితేశ్, కృనాల్‌ను వెనక్కి పంపాడు. టిమ్ డేవిడ్ (32; 18 బంతుల్లో 3×4, 2×6) రెచ్చిపోవడంతో చివరి 5 ఓవర్లలో ఆర్సీబీ 64 పరుగులు పిండుకుంది. సిరాజ్ (3/19), సాయికిశోర్ (2/22) రాణించారు.
Also Read
- Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
- US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల్లో పురోగతి.. ఆ అంశాల్లో వెనక్కి తగ్గని ఇరాన్..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Astrology: మే 22 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనూహ్య ఫలితాలు
ఛేదనలో గిల్ (14) త్వరగానే అవుట్ అయినా సాయి సుదర్శన్ నిలిచాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తూ జోస్ బట్లర్‌కు అండగా నిలిచాడు. బట్లర్ రెచ్చిపోవడంతో గుజరాత్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 13వ ఓవర్లో సుదర్శన్‌ను హేజిల్‌వుడ్ ఔట్ చేయడంతో.. 75 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రూథర్‌ఫర్డ్ (30 నాటౌట్; 18 బంతుల్లో 1×4, 3×6)తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివరి 3 ఓవర్లలో 29 పరుగులు చేయాల్సివుండగా.. ఈ ఇద్దరు సిక్స్‌లు బాదేసి మ్యాచ్‌ను ముగించారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
తాజావార్తలు
-
Jyotika: సినిమాలకు బ్రేక్ తర్వాత కెమెరా ముందు భయపడ్డా..
-
Rooftop Water Tank Cooling Tips: ఎండ వేడితో ఇంటిపైన ఉన్న ట్యాంక్ నీరు మరుగుతోందా..? ఈ చిన్న చిట్కాలతో చల్లగా మారిపోతుంది..!
-
Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
-
Sharvari Wagh: షూటింగ్లో అలియాను చూసి ఎన్నో నేర్చుకున్నా: శార్వరీ
-
Ruturaj Gaikwad: ముగిసిన సీఎస్కే ప్రయాణం.. ధోనీ రిటైర్మెంట్పై CSK కెప్టెన్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!