Site icon NTV Telugu

PBK vs RCB: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ.. గెలుపు ఎవరిది?

Pbks Vs Rcb1

Pbks Vs Rcb1

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ నంబర్-37లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ముల్లన్‌పూర్ (న్యూ చండీగఢ్)లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

READ MORE: Assam: భార్య తల నరికి, తలతో పోలీస్ స్టేషన్‌కు..

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ చెరో ఏడు మ్యాచ్‌లు ఆడాయి. పంజాబ్ ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. బెంగళూరు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఏప్రిల్ 18న ఈ రెండు టీంల మధ్య బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అందులో పంజాబ్ విజయం సాధించింది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో ఇప్పటివరకు పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 34 మ్యాచ్‌లు జరిగాయి. పంజాబ్ కింగ్స్18 మ్యాచ్‌ల్లో గెలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

READ MORE: UP techie Suicide: ‘‘అమ్మా నాన్న క్షమించండి’’.. భార్య వేధింపులకు మరో వ్యక్తి ఆత్మహత్య..

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్-11: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్-11: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

Exit mobile version