Site icon NTV Telugu

IPL 2025 Final RCB: ఫైనల్ ముందు ఆర్సీబీ బలాబలాలు ఇవే.. టైటిల్ సాధించడానికి సరిపోతాయా..?

Rcb 2025 Ipl Final

Rcb 2025 Ipl Final

IPL 2025 Final RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తన దూకుడు ఆటతో అభిమానులను అలరిస్తూ నాల్గవసారి ఫైనల్‌ కి చేరుకుంది. ఇక ఈ సీజన్ మొత్తం మీద ఆర్సీబీ అత్యంత బ్యాలెన్స్ ఉన్న జట్టుగా కనిపిస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బ్యాటింగ్, బౌలింగ్ లతోపాటు అన్ని విభాగాలలో మెరుగైన ప్రదర్శనతో మెరిసింది. ఇక ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ బలాబలాలు ఏంటో ఒకసారి చూద్దామా..

Read Also: Phil Salt: ఆర్సీబి ఊపిరి పీల్చుకో.. అందుబాటులోకి విధ్వంసక ప్లేయర్..!

అన్నికంటికంటే ముందుగా చెప్పాల్సిన విషయమే కోహ్లీ ఫామ్. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇప్పటివరకు ఎనిమిది అర్ధ సెంచరీలతో 600కి పైగా పరుగులు చేశాడు. ఓపెనింగ్‌లో తనదైన మార్క్ బ్యాటింగ్ తో జట్టుకు మంచి ఆరంభాన్ని ఇస్తున్నాడు. ఇక మరోవైపు అతనికి సరైన జోడీగా నిలిచిన ఫిలిప్ సాల్ట్ మరో కీలక ప్లేయర్. ఈ సీజన్‌లో 387 పరుగులు చేసిన సాల్ట్, ఫ్లైయింగ్ స్టార్ట్ ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

ఇక మిడిల్ ఆర్డర్‌లో జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా లాంటి ఆటగాళ్లు ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు వేగాన్ని పరుగెత్తిస్తున్నారు. ఇక చివర్లో నాతో పెట్టుకుంటే దబిడి దిబిడే అంటూ ఆడే కెరీబియన్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ తన ఫినిషింగ్ టచ్‌తో మ్యాచ్‌ల ఫలితాలను మార్చగల సామర్థ్యం ఉన్న ఆటగాడుగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉండగా.. బౌలింగ్ విభాగంలోనూ ఆర్సీబీ బలంగా కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్‌వుడ్‌ లాంటి బౌలర్లు పవర్‌ప్లేలో తన భీకర బౌలింగ్ తో ప్రత్యర్థులను కుప్పకూలుస్తున్నాడు. ముఖ్యంగా హెజిల్‌వుడ్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 21 వికెట్లు తీసి బెంగళూరుకు కీలక ఆటగాడిగా మారాడు. ఇక యువ బౌలర్ యశ్ దయాళ్ తన స్పీడ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలో 20వ ఓవర్‌ను మెయిడెన్‌ చేసిన అతి భీకర బౌలర్స్ ఎవరో తెలుసా..?

అంతేకాకుండా, స్పిన్ విభాగంలో సుయాష్ శర్మ మాయాజాలం చూపిస్తున్నాడు. ప్రత్యర్థులపై స్పిన్‌తో ప్రభావం చూపే సామర్థ్యం ఉన్న అతడు మధ్య ఓవర్లలో కీలకంగా మారుతున్నాడు. ఈ విధంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో ఆర్సీబీ పటిష్టంగా తయారై ఉంది. ఫైనల్ పోరులో ఈ సమన్వయం జట్టును టైటిల్‌ గెలిచేలా ఉందన్న ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Exit mobile version