Phil Salt: ఆర్సీబి ఊపిరి పీల్చుకో.. అందుబాటులోకి విధ్వంసక ప్లేయర్..!
- ఆర్సీబి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..
- అందుబాటులోకి విధ్వంసక ప్లేయర్ సాల్ట్ (Phil Salt).
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phil Salt: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఫైనల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నాలుగోసారి చేరుకుంది. మరోవైపు వారి ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు రెండోసారి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఇరు జట్లు ఒక్కసారి కూడా విజయం అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయం. ఇకపోతే, తాజాగా ఆర్సీబీ జట్టుకి సంబంధించిన ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఫిలిప్ సాల్ట్ తండ్రి అయ్యాడు. తన మొదటి సంతానం పుట్టిన సమయంలో ఇంగ్లాండ్ వెళ్లిన సాల్ట్, ఇప్పుడు తిరిగి భారత్‌కు వచ్చారు. దీంతో ఆయన ఫైనల్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నారు.
Read Also: IPL 2025 Final: వర్షం కారణంగా ఫైనల్ రద్దయితే.. నెక్స్ట్ ఏంటి..? రిజర్వ్ డే ఉందా..?
Also Read
నేటి ఉదయం సాల్ట్ అహ్మదాబాద్‌కు చేరుకోవడంతో ఇది ఆర్సీబీ అభిమానులకు శుభవార్తగా మారింది. 29 మేన జరిగిన క్వాలిఫయర్ 1లో పాల్గొన్న సాల్ట్ ఆ తరువాత తన భార్య, పుట్టబోయే వారికోసం స్వదేశానికి వెళ్లాడు. ఆర్సీబీ ట్రైనింగ్ సెషన్లలో సాల్ట్ గైర్హాజరు కావడంతో అభిమానుల్లో ఆయన లభ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అహ్మదాబాద్ విమానాశ్రయానికి ఆయన తిరిగి వచ్చిన ఫొటోలు వైరల్ కావడంతో ఆ అనుమానాలకు ముగింపు పలికింది.
Read Also: IPL 2025 Winner: అందరి అంచనాలు ఆ టీం వైపే.. చివరికి AI కూడా..!
ఇకపోతే, ఫిలిప్ సాల్ట్ ఈ సీజన్‌లో ఆర్సీబీకి కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 175.9 స్రైక్ రేట్, 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. ఇక ముఖ్యంగా క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 27 బంతుల్లోనే 56 పరుగులు చేయడంతో ఆర్సీబీ విజయంలో కీలకంగా మారింది. మొత్తంగా ఫిలిప్ సాల్ట్ తిరిగి రావడంతో ఆర్సీబీకి ఫైనల్‌లో ఒక మానసిక ఆత్మవిశ్వాసం లభిస్తుంది. ఇంతకుముందే కీలక మ్యాచ్‌లో మెరిసిన సాల్ట్, ఇప్పుడు తన కుటుంబానికి, జట్టుకి సమాన ప్రాధాన్యతనిస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఫైనల్‌లో కూడా ఆయన ఆటతీరు ఆర్సీబీ విజయంలో కీలకమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!