Site icon NTV Telugu

IPL 2025 Final PBKS: బ్యాటింగ్ ఓకే.. మరి బౌలింగ్ పరిస్థితేంటి..? కొత్త ఛాంపియన్‌గా పంజాబ్ నిలుస్తుందా..?

Pbks 2025 Ipl Final

Pbks 2025 Ipl Final

IPL 2025 Final PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్‌కు చేరిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరు కనబరిచి అభిమానుల మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు మెరుపు ప్రదర్శన చేస్తూ రాణించింది. అయితే బౌలింగ్ విభాగంలో మాత్రం కాస్త వెనుకబడినట్లు కనిపిస్తోంది. మరి రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన పంజాబ్ జట్టు బలాలు, బలహీనతలు ఏంటో ఒకసారి చూద్దామా..

Read Also: IPL 2025 Final RCB: ఫైనల్ ముందు ఆర్సీబీ బలాబలాలు ఇవే.. టైటిల్ సాధించడానికి సరిపోతాయా..?

పంజాబ్ బ్యాటింగ్‌లో మీరు ఇన్నింగ్స్ అదే ఓపెనింగ్ జోడీగా ప్రియాన్ష్, ప్రభ్ సిమ్రాన్ నిలిచారు. వీరిద్దరూ కలిసి పవర్‌ప్లేలో మంచి ఆరంభాలను అందిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడికి నెట్టేస్తున్నారు. వీరి తరువాత వచ్చే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత సీజన్‌లో ఎప్పుడు లేనంత అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే 600కి పైగా పరుగులు చేసి పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒత్తిడిని అధిగమించి నిలకడగా ఆడుతూ ఇంగ్లిష్, హ్యారీ బ్రూక్, ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ కూడా పంజాబ్ మిడిల్ ఆర్డర్‌కు మంచి స్కోర్ ను అందిస్తున్నారు. వీరికి తోడుగా నేహాల్ వధేరా, శశాంక్ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ జట్టుకు భారీ స్కోర్ల దిశగా తీసుకెళ్తున్నారు.

Read Also: Phil Salt: ఆర్సీబి ఊపిరి పీల్చుకో.. అందుబాటులోకి విధ్వంసక ప్లేయర్..!

అయితే, పంజాబ్ బౌలింగ్ విభాగమే జట్టుకు ప్రధాన బలహీనతగా కనపడుతుంది. ముఖ్యంగా అర్ష్‌దీప్ సింగ్ పరిమిత పరుగులు ఇవ్వడంలో విజయవంతం అవుతున్నా, తక్కువ వికెట్లు మాత్రమే పడగొట్టాడు. మరోవైపు, కైలె జేమిసన్ మంచి వికెట్లు తీస్తున్నా అతని బౌలింగ్‌లో భారీగా పరుగులు వస్తున్నాయి. ఇక అజ్మతుల్లా ఒమర్‌జాయ్ మాత్రం పూర్తిగా ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పంజాబ్ స్పిన్ ఆశలు యూజవేంద్ర చహాల్ మీదే ఆశలు ఉన్నాయి. చహాల్ అనుభవంతో పాటు వికెట్లు తీయగల సామర్థ్యం ఉన్నాడని గత మ్యాచ్‌లు సూచిస్తున్నాయి. బౌలింగ్‌లో ఉన్న లోటును పూడ్చడానికి చహాల్ పై బరువు మోసే అవకాశముంది. మొత్తంగా పంజాబ్ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను నెగ్గే ప్రయత్నం చేస్తుందన్నది స్పష్టమవుతోంది. కానీ, బౌలింగ్‌లో తగినంత మద్దతు లేకుంటే కష్టమే. అభిమానులు మాత్రం ఈసారి టైటిల్‌ పంజాబ్‌కే రావాలని ఆశపడుతున్నారు.

Exit mobile version