Site icon NTV Telugu

Sanju Samson: మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌.. సంజూ శాంసన్ చరిత్ర!

Sanju Samson Rr

Sanju Samson Rr

రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్‌ సంజూ శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ 50 పరుగుల తేడాతో విజయం సాధించడంతో.. సంజూ మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ షేన్ వార్న్ రికార్డును బ్రేక్ చేశాడు.

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్ మొత్తం 62 మ్యాచుల్లో 32 విజయాలు సాధించాడు. సంజూ కెప్టెన్సీలో ఆర్ఆర్ 29 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. షేన్ వార్న్ 55 మ్యాచుల్లో 31 విజయాలు అందుకున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్‌ 2008లో రాజస్థాన్ జట్టుకు వార్న్ టైటిల్‌ అందించారు. రాహుల్ ద్రవిడ్, స్టీవ్ స్మిత్, అజింక్య రహానేలు కూడా ఆర్ఆర్‌కు సారథులుగా వ్యవహరించారు. 2021లో రాజస్థాన్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న సంజూ.. సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2025లోని తొలి మూడు మ్యాచులకు శాంసన్ కెప్టెన్సీ చేయలేదు. ఫిట్‌నెస్‌ కారణంగా కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడాడు.

Also Read: Tamilnadu-BJP: తమిళనాడులో అధికారమే లక్ష్యంగా బీజేపీ స్కెచ్.. నేడు కీలక భేటీ!

రాజస్థాన్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు:
32 – సంజు సామ్సన్ (62 మ్యాచ్‌లు)
31 – షేన్ వార్న్ (55 మ్యాచ్‌లు)
18 – రాహుల్ ద్రవిడ్ (34 మ్యాచ్‌లు)
15 – స్టీవెన్ స్మిత్ (27 మ్యాచ్‌లు)
9 – అజింక్య రహానే (24 మ్యాచ్‌లు)

Exit mobile version