Site icon NTV Telugu

IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్ ఇండియాలో ఉండదు.. కారణమదే..!

Ipl 2024

Ipl 2024

ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కరోనా సమయంలో భారత్లో ఐపీఎల్ నిర్వహించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా వేరే దేశాల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్కు ఇదొక చేదువార్తలా చెప్పవచ్చు. ఐపీఎల్ భారత్లో జరగకపోవడానికి గల కారణాలేంటంటే.. వచ్చే ఏడాదే భారత్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఐపీఎల్‌ను భారత్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు.

Read Also: health tips: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే నేతిబీరకాయ ఉపయోగాలు

2009లో జరిగిన ఐపీఎల్లో లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో కొన్నిచోట్ల గొడవలు జరిగాయి. దీంతో ఇండియాలో కాకుండా.. వేదికను దక్షిణాఫ్రికాకు మార్చారు. అయితే ఐపీఎల్ 2024 మ్యాచ్ లను కూడా ఇండియా నుండి వేరే దేశానికి మార్చడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ చైర్మన్ ఈ చర్చలకు ముగింపు పలికారు. ఐపీఎల్ 2024 భారత్‌లోనే నిర్వహిస్తామని ఛైర్మన్ అరుణ్ సింగ్ ఠాకూర్ సూచించారు. ఓ వార్త కథనం ప్రకారం.. ఐపీఎల్‌కు లోక్‌సభ ఎన్నికలు ఎటువంటి ఆటంకం కాబోవని అరుణ్ ఠాకూర్ అన్నారు. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టీ20 లీగ్ అని.. ఈ లీగ్ బీసీసీఐకి దానితో సంబంధం ఉన్న వ్యక్తులందరికీ చాలా డబ్బును సంపాదించి పెడుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఏప్రిల్, మేలో ఐపీఎల్ నిర్వహించేందుకు బోర్డు ప్రపంచ కప్‌ను వాయిదా వేసింది. అయితే ఐపీఎల్ 2024 ఇండియాలో నిర్వహించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా నిర్వహించబడకపోతే దక్షిణాఫ్రికా, యూఏఈ దేశాలకు షిఫ్ట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Read Also: Malaika Arora: వెరైటీ డ్రెస్సులో హాట్ బ్యూటి కిర్రాక్ పోజులు.. మైండ్ బ్లాక్ చేస్తున్న మలైక న్యూ స్టిల్స్ ..

Exit mobile version