మంగళవారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. ఐపీఎల్ అంటేనే సిక్స్లు, ఫోర్లు బాధడమే. క్రేజ్ లోకి వచ్చినప్పుడు నుంచి బాల్ ని బౌండరీ లైన్ అవతలికి తరలించడమే బ్యాటర్ పని. ఇకపోతే తాజాగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా తన ఐపీఎల్ కెరియర్ ని ఓ రేంజ్ లో మొదలుపెట్టాడు భారత డొమెస్టిక్ ప్లేయర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సమీర్ రిజ్వి. కేవలం 20 ఏళ్ల కుర్రోడు తన ఐపీఎల్ కెరియర్ ను ఎంతో అనుభవం ఉన్న రషీద్ ఖాన్ లాంటి బౌలర్ ని ఎదుర్కొని ఎటువంటి భయం లేకుండా మొదటి బంతిని సిక్స్ గా మలిచాడు. దీంతో ప్రస్తుతం రిజ్వి పై ప్రశంసల జల్లు కురుస్తుంది.
Also read: YSRCP: చంద్రబాబును ఓడిస్తాం.. కుప్పం ప్రజలకే మొట్టమొదటిగా నీరు ఇస్తాం
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆటగాడు ఐపీఎల్ మినీ వేలంలో రూ 8.4 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. కాకపోతే అప్పుడు అందరూ ఈ యంగ్ ప్లేయర్ కి ఇంత ధర అవసరమా.. అంటూ ప్రశ్నించారు. కాకపోతే మంగళవారం నాడు జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించడంతో ముందుగానే గ్రీస్ లోకి వచ్చిన అతను మొదటి బంతిని సిక్సర్ గా మలిచాడు.
Also read:Viral Video: వావ్.. కుక్కతో కలిసి విదేశీ వనిత చేసిన శివ తాండవ నృత్యం అదుర్స్..!
టి20 క్రికెట్లో ఎంతో అనుభవం ఉన్న స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ వేసిన 19 ఓవర్లో అతడికి చుక్కలు చూపించాడు. ఐపీఎల్ లో తను ఎదుర్కోబోయేది మొదటి బంతి అని కూడా చూడకుండా.. ఎదురుగా ఉన్న వరల్డ్ క్లాసు బౌలర్ అని తేడా చూపించకుండా.. రిజ్వి తన మొదటి బంతిని సిక్సర్ గా మలిచి అందరితో ప్రశంసలను అందుకుంటున్నాడు. ఆ తర్వాత అదే ఓవర్లో మరో బంతిని కూడా సిక్సర్ గా మలిచి తన సత్తా ఏంటో చాటాడు. అయితే ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో మోహిత్ శర్మ వేసిన బంతిని ఎదుర్కోవడంలో విఫలమై ఆరు బంతుల్లో రెండు సిక్సులు సహాయంతో 13 రన్స్ చేసి వెను తిరిగాడు యంగ్ క్రికెటర్. ఇక క్రికెట్ చరిత్రలో 9వ బ్యాటర్ గా తొలి బంతికే సిక్స్ కొట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
SAMEER RIZVI SMASHED RASHID KHAN FOR A SIX IN HIS FIRST BALL. 🔥pic.twitter.com/voISGlBpO5
— Johns. (@CricCrazyJohns) March 26, 2024