IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jake Fraser-McGurk Joins Delhi Capitals ahead of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఐపీఎల్ 17వ సీజన్ నుంచి తప్పుకోగా.. తాజాగా దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి కూడా తప్పుకొన్నాడు. గాయం కారణంగా ఈ ఎడిషన్ మొత్తానికి ఎంగిడి దూరం అయ్యాడు. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను ఢిల్లీ తీసుకుంది. ఈ విషయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను రూ. 50 లక్షల ధర (రిజర్వ్ ప్రైస్)కు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ‘ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం లుంగి ఎంగిడి స్థానంలో ఆల్‌రౌండర్ జేక్ ఫ్రేజర్ మెగర్క్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఎంపిక చేసింది. 14 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు తీసిన ఎంగిడి.. గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా తరపున జేక్ ఫ్రేజర్ మెగర్క్ 2 వన్డేలు ఆడాడు. తన రిజర్వ్ ధర రూ.50 లక్షలతో ఢిల్లీలో చేరాడు’ అని ఐపీఎల్ పేర్కొంది.
Also Read
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
- Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
21 ఏళ్ల జేక్ ఫ్రేజర్ మెగర్క్ బ్యాటర్ మాత్రమే కాదు లెగ్ స్పిన్నర్ కూడా. వెస్టిండీస్‌తో గత నెలలో జరిగిన వన్డే సిరీస్ ద్వారా అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో 51 పరుగులు చేశాడు. హ్యారీ బ్రూక్‌పై ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే అతడు వ్యక్తిగత కారణాలతో టోర్నీకి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ 2024 మార్చి22న ఆరంభం కానుంది. ఢిల్లీ మార్చి 23న తమ తొలి మ్యాచ్‌లో మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.
తాజావార్తలు
-
Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
-
Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!