Deepak Chahar: సీఎస్‌కే కెప్టెన్ ఎవరో తెలియక తికమక పడుతున్నా: దీపక్ చహర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepak Chahar Said I got to look at MS Dhoni and at Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్సీపై ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చహర్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. సీఎస్‌కే కెప్టెన్ ఎవరో తెలియక తాను కాస్త తికమక పడుతున్నా అని పేర్కొన్నాడు. బౌలింగ్ చేసే సమయంలో తాను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత సారథి రుతురాజ్ గైక్వాడ్ వైపు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. సీఎస్‌కే కెప్టెన్‌గా ధోనీ స్వయంగా తప్పుకోవడంతో.. ఐపీఎల్ 2024లో జట్టు పగ్గాలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఎంతో అనుభవం ఉన్న మహీ.. మైదానంలో రుతురాజ్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
మంగళవారం రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం దీపక్ చహర్ మాట్లాడుతూ.. మైదానంలో ఎంఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్‌లలో ఎవరి ఆదేశాలు వినాలో తెలియట్లేదని అన్నాడు. ‘మైదానంలో సూచనల కోసం ధోనీ, రుతురాజ్‌లలో ఎవరివైపు చూడాలో తెలియక కాస్త తికమక పడుతున్నా. అందుకే ఇద్దరివైపు చూస్తున్నా. రుతురాజ్ జట్టును గొప్పగా నడిపిస్తున్నాడు’ అని చహర్ తెలిపాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చహర్ రెండు కీలక వికెట్లు తీశాడు. గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (21), శుభ్‌మన్ గిల్ (8)ను ఔట్ చేశాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
Also Read: SRH vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మకు చాలా ప్రత్యేకం!
ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసేందుకు అవకాశం కల్పిస్తూ.. ఐపీఎల్ నిర్వాహకులు కొత్త రూల్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దీపక్ చహర్ స్పందిస్తూ… ‘ఐపీఎల్ కెరీర్ ఆరంభం నుంచి నేను పవర్‌ప్లేలో 3 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాను. నేను దానికి అలవాటు పడ్డాను. కొత్త నిబంధనలతో వీలైనంత బాగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదివరకు ఓవర్‌లో తొలి 3 బంతుల్లో బౌన్సర్ వేస్తే.. మిగతావి లైన్ అండ్ లెంగ్త్‌తో వస్తాయని బ్యాటర్లు అంచనా వేసేవారు. ఇప్పుడు ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లు వేసే అవకాశం లభించింది. దీంతో బ్యాటర్లపై బౌలర్లు పైచేయి సాధించేందుకు అవకాశం ఉంది. కొత్త రూల్ పేసర్లకు చాలా ఉపయోగకరం’ అని చెప్ప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!