NTV Telugu Site icon

Dhoni-Rahane: మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది: రుతురాజ్‌

Ruturaj Gaikwad Csk

Ruturaj Gaikwad Csk

Ruturaj Gaikwad Praises MS Dhoni and Ajinkya Rahane’s Fielding: ఎంఎస్ ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ ప్రశంసించాడు. ధోనీ, రహానేను చూస్తుంటే జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్టుందన్నాడు. నాణ్యమైన ఫీల్డింగ్‌ తమకు అదనపు బలం అని రుతురాజ్‌ పేర్కొన్నాడు. చెపాక్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన చెన్నై గుజరాత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ముందుగా బ్యాటింగ్‌.. ఆపై బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంది.

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్ మాట్లాడుతూ… బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ విభాగాల్లో మా జట్టు అదరగొట్టింది. గుజరాత్‌ వంటి ప్రత్యర్థిపై ఇలాంటి ప్రదర్శన చాలా అవసరం. చెన్నై పిచ్‌ ఎప్పుడు ఎలా మారుతుందో మాకు తెలియదు. మొదట బ్యాటింగా? బౌలింగా? అని సంబంధం లేకుండా.. బాగా ఆడాలని భావించాం. ఇక్కడ వికెట్లు చేతిలో ఉంటే చివర్లో దూకుడుగా ఆడేందుకు అవకాశం ఉంటుంది’ అని అన్నాడు.

Also Read: Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్‌ను చూశారా?

‘రచిన్ రవీంద్ర పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. దాంతో మేం మంచి రన్ రేట్ సాధించాం. దానినే కొనసాగించాం. శివమ్ దూబె కీలకఇన్నింగ్స్‌ ఆడాడు. దూబెతో మేనేజ్‌మెంట్‌, ఎంఎస్ ధోనీ ప్రత్యేకంగా వర్కౌట్‌ చేశారు. అతడికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. తన పాత్రల గురించి అతనికి బాగా తెలుసు. ఖచ్చితంగా అతను మాకు చాలా ప్లస్ అవుతాడు. ధోనీ, అజింక్య రహానే వంటి సీనియర్లు ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నారు. మా జట్టులో అదనంగా మరో ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లుంది. రహానే ఫీల్డింగ్ నైపుణ్యం గత మ్యాచ్‌లోనూ చూశాం. నాణ్యమైన ఫీల్డింగ్‌ మాకు అదనపు బలం’ అని రుతురాజ్‌ గైక్వాడ్ పేర్కొన్నాడు.