ఇవాళ సాయంత్రం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ ప్రారంభం కాబోతుంది. అయితే తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తో పోటీ పడుతుంది. అయితే సీఎస్కే తుది జట్టు కూర్పులో భాగంగా ఏకంగా ధోనినే ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకునే అవకాశం ఉంది. గత కొంత కాలంగా క్రికెట్ వర్గాల్లో చర్చొపచర్చలు సాగుతున్నాయి. ఈ సీజన్ లో కొన్ని కొత్త నిబంధనలు వస్తున్నాయి.. అందులో ఒకటే ఇంపాక్ట్ ప్లేయర్.
Also Read : Sai Dharam Tej: ఆ ఒక్కటి మిగిలింది… కానీ అంతా అయిపొయింది…
ఇంపాక్ట్ ప్లేయర్ అంటే మ్యాచ్ జరుగుతుండగా ఇన్సింగ్స్ 14వ ముగిసిన తర్వాత ఒక ఆటగాడి స్థానంలో తుది జట్టులో లేని ప్లేయర్ ను కూడా తీసుకోవచ్చు. ఈ రూల్ ను ఫ్రాంఛైజీలు ఎలా వాడతాయో గానీ మ్యాచ్ లను సదరు ఇంపాక్ట్ ప్లేయర్ ఆటను ఎలా ప్రభావితం చేస్తాడోనని ఐపీఎల్ టీమ్స్ తో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న టోర్నీలో తొలి మ్యాచ్ సీఎస్కే వర్సెస్ గుజరాత్ సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ లో చెన్నై సారథి ధోని ఆడతాడా లేదా.. అన్నది ఇంకా స్పష్టత రాలేదు. రెండ్రోజుల క్రితం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ధోని ఎడమ మోకాలికి గాయమైందని.. అతడు గుజరాత్ తో మ్యాచ్ కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నా.. చెన్నై టీమ్ సీఈవో కాశీ విశ్వానాథ్ మాత్రం వీటిని ఖండించాడు.
Also Read : Jeevan Reddy: బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పార్టీలు దొంగలే
అయితే మ్యాచ్ ఆడేందుకు ధోని పూర్తి ఫిట్ గా లేకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా అయినా వాడుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తుంది. ఇలా చేస్తే సగం ఇన్సింగ్స్ ముగిశాక ధోని క్రీజులోకి వచ్చి మెరుపులు మెరిపించి తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు. టీమ్ లో ఎలాగూ డెవాన్ కాన్వే రూపంలో వికెట్ కీపర్ కూడా ఉన్నాడు. ఈ రూల్ ను వాడితే జట్టు కూర్పు కూడా సీఎస్కేకు కలిస్తొస్తుంది. ఓపెనర్లుగాడెవాన్ కాన్వే, రుతురాజ్ ఆడనుండగా వన్ డౌన్ లో బెన్ స్టోక్స్ ను ఆడించాలని సీఎస్కే భావిస్తున్నంది. ఇదే స్టోక్స్ కు బెస్ట్ ప్లేస్. వాస్తవానికి ఈ ప్లేస్ లో మొయిన్ ఆలీ వచ్చేవాడు.
Also Read : YCP vs TDP: తెనాలి మున్సిపల్ సమావేశంలో రసాభాస.. కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
కానీ ఇప్పుడు ఆలీని నాలుగో స్థానానికి పంపి ఆ తర్వాత శివమ్ ధూబే, రవీంద్ర జడేజాలను పంపించొచ్చు. ఇలా చేస్తే కూడా ఓ సమస్య ఉంది. అలీ తర్వాత క్రీజులోకి వచ్చే అంబటి రాయుడును ఎక్కడ ఆడించాలన్నది కీలకం. మరి చెన్నై జట్టు ఎలా ఉండనుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గుజరాత్ ఓపెనర్ల విషయానికి వస్తే.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ ఫామ్ తో దూసుకుపోతున్న శుభ్ మన్ గిల్.. కివీస్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ తో కలిసి ఇన్సింగ్స్ ఓపెన్ చేయనున్నాడు. గత సీజన్ లో పలు మ్యాచ్ లకు వృద్ధిమాన్ సాహా, మరికొన్నింటికీ మాథ్యూవేడ్ తో కలిసి గిల్ ఓపెనర్ గా వచ్చాడు.
