NTV Telugu Site icon

IPL 2023 : ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు రోహిత్ రిక్వెస్ట్

Rohit Sharma

Rohit Sharma

మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్ కు.. ఇప్పటికే రంగం సిద్దమైంది. ఇక ఇవాళ్టి నుంచి ప్రాక్టీస్ సెషన్ లు కూడా ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ లో ఆడాల్సి ఉన్న పలువురు స్టార్ క్రికెటర్లు గాయాలతో టోర్నమెంట్ కు దూరరమయ్యారు. టీమ్ ఇండియాలోని పలువురు ప్లేయర్లు కూడా గాయాల కారణంగా ఐపీఎల్ సీజన్ కు దూరంకానున్నారు. గాయం అంత తీవ్రతరమైనది కాకుంటే ఆటగాళ్లను ఐపీఎల్ లో ఆడించాలనే ప్రయత్నాల్లో జట్టు యాజమాన్యాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక్కో ఆటగాడిపై భారీగా ఖర్చు చేశాయి. ఒకవేళ ఇదే జరిగితే భవిష్యత్ లో భారత్ పలు కీలక టోర్నమెంట్ లు ఆడాల్సి ఉంది. గాయాలపాలైన ఆటగాళ్లను ఐపీఎల్ ఆగిస్తే గాయం తిరగబెట్టే అవకాశం ఉంది. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

రెండు నెలల పాటు జరగనున్న ఐపీఎల్ టోర్నమెంట్ తర్వాత జూన్ లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ జరుగునుంది. దీంతో ఆటగాళ్ల ఫిట్ నెస్ చాలా ముఖ్యమని రోహిత్ శర్మ తెలిపాడు. భవిష్యత్ లో టీమ్ ఇండియా పలు ఐసీసీ టోర్నీల్లో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ తో ఆటగాళ్ల ఫిట్ నెస్ కోల్పోతారు కదా అన్న ప్రశ్నకు రోహిత్ శర్మ సూటిగా ఆన్సర్ ఇచ్చాడు. బీసీసీఐ ఆటగాళ్ల ఫిట్ నెస్ పై ఫైకస్ చేసిందని చెప్పారు. కానీ ఆటగాళ్ల ఫిట్ నెస్ ను దృష్టిలో ఉంచుకుని ఆయా జట్లు యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కానీ అంతిమ నిర్ణయం ఫ్రాంఛైజీలదే అని రోహిత్ క్లారిటీ ఇచ్చారు.

Also Read : India at UNHRC: ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ పాఠాలు అవసరం లేదు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్

ఆటగాళ్లకు భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారు కాబట్టి ఆ నిర్ణయం ఫ్రాంఛైజీలపై ఉంటుందని రోహిత్ శర్మ అన్నారు. ఎవరైతే గాయాలతో ఇబ్బంది పడుతున్నారో..వారు ఏ ఐపీఎల్ జట్టుకైతే ఆడుతున్నారో ఆ జట్టు యాజమాన్యాలక ఉన్న పరిస్థితి వివరించాం.. ఇక అంతిమ నిర్ణయం ఆయా ఫ్రాంఛైజీలదే.. ఆటగాళ్లు కూడా తమ ఫిట్ నెస్ పై శ్రద్ద తీసుకోవాలంటూ రోహిత్ శర్మ సూచించారు. ఒకవేళ శరీరంలో మార్పులు గమనించినట్లయితే ఆయా ఫ్రాంఛైజీలతో మాట్లాడి ఒకటి రెండు మ్యాచ్ లకు విశ్రాంతి తీసుకోవాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.