iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iPhone 18 Launch Date: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గరపడుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, యాపిల్ తన తదుపరి ఐఫోన్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ‘ఐఫోన్ అల్ట్రా’ను కూడా పరిచయం చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
సెప్టెంబర్ 9 లేదా 10న లాంచ్?
యాపిల్ గత కొన్నేళ్లుగా సెప్టెంబర్‌లోనే కొత్త ఐఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా సెప్టెంబర్ రెండో వారంలో లాంచ్ ఈవెంట్ నిర్వహించే అవకాశముందని మార్క్ గుర్మన్ తెలిపారు. అమెరికాలో లేబర్ డే, సెప్టెంబర్ 11 వార్షిక దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో ఈవెంట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
- Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్‌బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
- Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ఐఫోన్ 18 ప్రోలో భారీ అప్గ్రేడ్లు
లీకుల ప్రకారం ఐఫోన్ 18 ప్రో మోడళ్లలో 2nm టెక్నాలజీతో రూపొందించిన కొత్త A20 Pro చిప్సెట్ ఉండనుంది. దీంతో పనితీరు మరింత వేగవంతంగా ఉండటంతో పాటు బ్యాటరీ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది. యాపిల్ సొంతంగా అభివృద్ధి చేసిన C2 మోడెమ్, చిన్న పరిమాణంలో డైనమిక్ ఐలాండ్, అండర్-డిస్ప్లే ఫేస్ ఐడీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అలాగే ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో వేరియబుల్ అపర్చర్ కెమెరా టెక్నాలజీని అందించే అవకాశం ఉందని సమాచారం. దీంతో వినియోగదారులు కాంతి పరిమాణాన్ని అవసరానికి అనుగుణంగా నియంత్రించగలుగుతారు.
ఫోల్డబుల్ ‘ఐఫోన్ అల్ట్రా’పై భారీ అంచనాలు
ఈసారి యాపిల్ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను కూడా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయి. ‘ఐఫోన్ అల్ట్రా’గా పిలుస్తున్న ఈ ఫోన్ ఇతర ఫోల్డబుల్ ఫోన్ల కంటే వెడల్పైన డిస్ప్లే, మెరుగైన హింజ్ డిజైన్‌తో రానున్నట్లు లీకులు చెబుతున్నాయి. ఫోన్ తెరిచినప్పుడు కేవలం 4.5 మిల్లీమీటర్ల మందంతో ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫోన్లో కూడా A20 Pro చిప్, C2 మోడెమ్, 12GB ర్యామ్, ప్రత్యేక కెమెరా కంట్రోల్ బటన్ వంటి ఫీచర్లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
ధరలు పెరిగే అవకాశం
ఇటీవల భారత్‌లో మ్యాక్బుక్లు, మ్యాక్ మినీ, యాపిల్ టీవీ, హోమ్‌పాడ్ వంటి ఉత్పత్తుల ధరలను యాపిల్ పెంచింది. గ్లోబల్ మార్కెట్లో మెమరీ, స్టోరేజ్ చిప్‌ల ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇదే ప్రభావం ఐఫోన్ 18 ప్రో సిరీస్‌పైనా పడే అవకాశముందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రో మోడళ్ల ధరలు 200 డాలర్ల వరకు పెరగొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై యాపిల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
తాజావార్తలు
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
-
Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!