Iphone 17 Pre Booking: ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ ప్రారంభం.. ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎంత చెల్లించాలో తెలుసా?
- ఇటీవలే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు లాంచ్
- నేడు ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ ప్రారంభం
- ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఎంత చెల్లించాలో తెలుసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా దిగ్గజ సంస్థ ‘యాపిల్’ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రోమ్యాక్స్‌లతో పాటు ఈసారి కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసింది. మరింత మన్నిక, డిజైన్ మెరుగుదల, మెరుగైన పనితీరుతో ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను ఆవిష్కరించింది. ఇక భారతదేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లను అధికారికంగా యాపిల్ కంపెనీ ప్రారంభించింది. ప్రీ-ఆర్డర్‌లు ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రీ-ఆర్డర్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, అందుకు ఎంత చెల్లించాలి అనే డీటెయిల్స్ చూద్దాం.
కస్టమర్లు యాపిల్ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ప్రధాన రిటైలర్‌ల ద్వారా ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్ (క్రోమా), విజయ్ సేల్స్ స్టోర్లలో ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో అందుబాటులో రానుంది. అమెజాన్‌లో అయితే ఇప్పటివరకు ఏ ఆప్షన్ లేదు. డెలివరీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ ప్రీ-బుకింగ్ కోసం రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కోసం రూ.17,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
Also Read
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ప్రీ-బుక్ సమయంలో బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ, ట్రేడ్-ఇన్ ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రీ-డీల్స్యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికను కూడా పొందవచ్చు. ఆపిల్ ట్రేడ్-ఇన్ కింద మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.
Also Read: iPhone 16 Pro Price: యాపిల్ లవర్స్ ఎగిరి గంతేసే న్యూస్.. ఐఫోన్ 16 ప్రోపై రూ.43 వేల తగ్గింపు!
ముందస్తు ఆర్డర్ కోసం:
1. యాపిల్ ఆన్‌లైన్ స్టోర్, యాపిల్ ప్రీమియం రీసెల్లర్లు
2. రిలయన్స్ డిజిటల్, క్రోమా)
3. విజయ్ సేల్స్ స్టోర్లు
4. అమెజాన్ (ప్రస్తుతం అందుబాటులో లేదు)
5. ఫ్లిప్‌కార్ట్ ( త్వరలో)
ఐఫోన్ 17 సిరీస్, ప్రీ-బుకింగ్ ధర:
1. ఐఫోన్ 17 ధర రూ. 82,900 – ప్రీ-బుకింగ్ కోసం రూ.2,000
2. ఐఫోన్ ఎయిర్ ధర రూ. 1,19,900 – ప్రీ-ఆర్డర్ కోసం రూ.2,000
3. ఐఫోన్ 17 ప్రో బేస్ వేరియంట్ ధర రూ.1,34,900 – ప్రీ-ఆర్డర్ కోసం రూ.17,000
4. ఐఫోన్ 17 ప్రో మాక్స్ బేస్ వేరియంట్ ధర రూ.1,49,900 – ప్రీ-బుకింగ్ కోసం రూ.17,000
తాజావార్తలు
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!