మీరు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. కొన్ని రోజులు వేచి ఉండండి. రాబోయే కొద్ది నెలల్లో ఆపిల్ తన కొత్త పరికరాన్ని ఐఫోన్ 15 మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. యాపిల్ ఐఫోన్ల విషయంలో ఇప్పటికీ చాలా మందికి ఉన్న ఫిర్యాదు ఏంటంటే.. దీంట్లో వినియోగించే బ్యాటరీ. ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఫోన్లలో తక్కువ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అయితే ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న యాపిల్.. ఈ ఏడాది చివరలో విడుదలయ్యే ఐఫోన్ 15 సిరీస్‌లో (iPhone 15) బ్యాటరీపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
Undavalli Arun Kumar: యూనిఫాం సివిల్ కోడ్‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. ఎవరి వైఖరి ఏంటి..?
యాపిల్ పాత మోడల్‌తో పోలిస్తే iPhone 15 మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయబడిన బ్యాటరీని చూసే అవకాశం ఉంది. iPhone 15లో 3,877mAh బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు iPhone 14లో 3,877mAh యూనిట్‌ను ఇచ్చారు. అయితే iPhone 15 Plus పెద్ద 4,912mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారని తెలిసింది. మరోవైపు iPhone 15 Proలో 3,650mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఇది iPhone 14 Proలోని 3,200mAh బ్యాటరీ నుండి అప్‌గ్రేడ్ చేయబడింది. అంతే కాకుండా iPhone 15 Pro Maxలో 4,852mAh బ్యాటరీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు iPhone 14 Pro Maxలో 4,323mAh బ్యాటరీ ఇచ్చారు.
Sai Sushanth Reddy: పెళ్లి పీటలు ఎక్కనున్న సుశాంత్.. ఎంగేజ్మెంట్ పిక్ వైరల్
యాపిల్ కెమెరా విషయంలో కూడా కొన్ని మార్పుల చేయనున్నట్లు తెలుస్తోంది. గతేడాది రిలీజ్ చేసిన ఐఫోన్ 14 సిరీస్‌లో ఐఫోన్ 14, 14 ప్లస్ మోడళ్లలో కేవలం 12 ఎంపీ కెమెరా ఇవ్వగా.. మిగిలిన వాటిలో 48 ఎంపీ కెమెరాను ఇచ్చారు. అయితే ఈసారి అన్ని మోడళ్లలోనూ 48 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఐతే యాపిల్ కొత్తగా ఐఫోన్ 15 సిరీస్‌లో ఇంకేం మార్పులు తీసుకొస్తున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!
