NTV Telugu Site icon

iPhone 14 Offers: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఆఫర్ రెండు రోజులు మాత్రమే!

Iphone 14

Iphone 14

Buy iPhone 14 Rs 66499 in Amazon Prime Day Sale 2023: ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్‌’కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16 తేదీల్లో రెండు రోజుల పాటు సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి ఈ సేల్‌లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉంటాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని కేటగిరీల్లో భారీ డిస్కౌంట్స్ పొందొచ్చు. కేవలం ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ మెంబర్స్ కోసమే ఈ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ సేల్‌లో ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్ ఉంటుందని అమెజాన్ ప్రకటించింది.

ఐఫోన్ 14 మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 128 జీబీ వేరియంట్ ధర రూ. 79,900 కాగా.. 256 జీబీ వేరియంట్ ధర రూ. 89,900గా ఉంది. ఇక టాప్ వేరియంట్‌ 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900గా ఉంది. అయితే ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ 2023’లో యాపిల్ ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 66,499 ఉంటుందని అమెజాన్ ప్రకటించింది. రూ. 13,401 డిస్కౌంట్‌తో ఐఫోన్ 14 మీకు లభిస్తుంది. అంతేకాదు ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చు.

ఐఫోన్ 14 గత ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ అయ్యింది. ఐఫోన్ 14 ప్రారంభ ధర భారతదేశంలో రూ. 79,990గా ఉంది. అయితే అంత పెట్టి కొనలేని వారు దేశంలో చాలామంది ఉన్నారు. కొందరు ఆఫర్స్ కోసం ఎదురుచుస్తునారు. అలాంటి వారికోసం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ 2023 గొప్ప డీల్‌ అని చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు మిస్సవ్వకండి. యాపిల్ నుంచి సెప్టెంబర్‌లో ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ కానుంది. ఐఫోన్ 15 సిరీస్ లాంఛ్ అయితే.. ఐఫోన్ 14 సిరీస్‌ మొబైల్స్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Also Read: Virat Kohli Pakistan: పాకిస్థాన్ టూర్‌లో స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లీ, హీరోయిన్‌ దీపికా పదుకొణె!

Also Read: Rashi Khanna Saree Pics: పట్టు చీరలో రాశి ఖన్నా.. అందానికే అసూయ కలిగేలా మెరిసిపోతుంది!