Dwayne Bravo Six: డ్వేన్ బ్రావో భారీ సిక్సర్.. వీడియో చూస్తే వావ్ అనకుండా ఉండలేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Texas Super Kings Batter Dwayne Bravo Hits Biggest Six in MLC 2023 vs Washington Freedom: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిమానులను ఇంకా అలరిస్తూనే ఉన్నాడు. నాలుగు పదుల వయసులోనూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని చాటి చెబుతున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో బ్రావో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఈ క్రమంలోనే బ్రావో ఓ భారీ సిక్సర్ బాదాడు. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మేజర్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్ టీమ్‌కు డ్వేన్ బ్రావో ఆడుతున్నాడు. ఈ లీగ్లో భాగంగా టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రావో అజేయ హాఫ్ సెంచరీ (76; 39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు)తో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ మాజీ ప్లేయర్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. అది మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలోనే భారీ సిక్సర్‌గా నిలిచిపోయింది.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
Also Read: IND Playing XI WI: విరాట్ కోహ్లీ ఔట్.. వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ ఆడే భారత జట్టిదే!
ఇన్నింగ్స్ 17 ఓవర్‌ను వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు పేసర్, దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ అన్రిచ్ నోర్జ్ వేశాడు. ఈ ఓవర్ రెండో బంతిని నోర్జ్ షార్ట్ పిచ్ బాల్‌గా సాధించగా.. బ్రావో తనదైన పుల్ షాట్‌తో భారీ సిక్సర్‌గా మలిచాడు. లాంగాన్ మీదుగా వెళ్లిన బంతి ఏకంగా స్టేడియం బయటపడింది. బ్రావో 103 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు.ఈ భారీ సిక్సర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ బ్రావో ఆటలు ఫిదా అవుతున్నారు.
వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. 164 లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులకే పరిమితం అయింది. డ్వేన్ బ్రావో మెరుపులు మెరిపించనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. మథ్యూ షార్ట్ (80) భారీ హాఫ్ సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ఆడాడు.
Also Read: IND vs WI: వెస్టిండీస్‌కు అజిత్ అగర్కార్.. ఎవరి కోసం?
TO THE MOON🌕!
Dwayne Bravo with the BIGGEST SIX of the tournament!
1⃣1⃣5⃣/6⃣(17.2) pic.twitter.com/xDyWKy25nL
— Cognizant Major League Cricket (@MLCricket) July 17, 2023
తాజావార్తలు
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!