NTV Telugu Site icon

Pawan Kalyan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్‌కు ఆహ్వానం

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను టీటీడీ ఆలయ అధికారులు అందజేశారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో అందించారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు. అక్టోబర్‌ 4 నుంచి 12 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఏటాది వార్షిక బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ చూస్తే.. ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడసేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం, అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా , అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది.

Read Also: AP CM Chandrababu: మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడారంగానికి మళ్లీ ప్రోత్సాహం