కాలేశ్వరం ఈఎన్సీ హరి రామ్ ఆస్తులపై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 200 కోట్ల రూపాయల పైచిలుకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో అవి వందల కోట్లు విలువ చేస్తాయంటున్నారు ఏసిబి అధికారులు. కాళేశ్వరం ఈఎన్సీ హరి రామ్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. 13 చోట్ల భారీగా నివాస స్థలాలు, భవనాలు, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. ఈఎన్సీ హరి రామ్, అతని బంధువుల ఇండ్లల్లో 13 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది.
Also Read:Pakistan: పాక్ పౌరులకు నేడే లాస్ట్ డే.. ఒక్క మహారాష్ట్రలోనే 5 వేల మంది పాకిస్థానీయులు..
ఆదాయానికి మించి ఆస్తులను కలిగి ఉన్న ఆరోపణలపై హరీ రామ్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. గజ్వెల్ లో భారీగా ఆస్తులను కలిగి ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. షేక్ పేట్, కొండాపూర్ విల్లాలు.. శ్రీనగర్,నార్సింగి, మాదాపూర్ ఫ్లాట్స్ గుర్తించారు. ఏపీ అమరావతిలో కమర్షియల్ భవనం గుర్తింపు.. మార్కుక్ మండలంలో 28ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో 20 గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు గుర్తింపు.. 6 ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్ గుర్తింపు.. కొత్తగూడెం, కుబ్బులాపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లను గుర్తించారు అధికారులు.
Also Read:Rakul Preet Singh : దేవుడి దయవల్ల నాకు దాని అవసరం రాలేదు..
బీఎండబ్ల్యూ కార్ తో సహా బంగారు ఆభరణాలు, స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు స్వాధీనం.. ఈఎన్సీ హరి రామ్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించింది ఏసీబీ.. ఈఎన్సీ హరి రామ్ పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంటామని అధికారులు తెలిపారు. ఈఎన్సీ హరీ రామ్ దగ్గర ఉన్న ఆస్తులు, కోట్లాది రూపాయలు.. అధికారిక వాల్యూ కంటే అనధికారిక బహిరంగ మార్కెట్ వాల్యూ 10 రేట్లు ఎక్కువ అని అధికారులు వెల్లడించారు.
