Site icon NTV Telugu

Rahul Gandhi: మోడీ- అదానీలను ఇంటర్వ్యూ చేసిన రాహుల్‌!.. వీడియో అస్సలు మిస్సవ్వొద్దు

Rahul Gandhi

Rahul Gandhi

అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది ప్రత్యేకమైన, పాత సంబంధం!” అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.

READ MORE: Chinmoy Krishnadas: బంగ్లాదేశ్‌లో చిన్మయ్‌ కృష్ణదాస్‌తో పాటు మరో 164 మందిపై దేశద్రోహం కేసు

రాహుల్ గాంధీ వారిద్దరినీ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. వారిద్దరినీ ఫొటో తీస్తూ ‘మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటో చెప్పాలని’ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ముఖానికి మాస్క్ ధరించిన ఎంపీలు దీనికి సమాధాన మిచ్చారు. ఏం చేసినా తామిద్దరం కలిసే చేస్తామని.. తమది ఏళ్లనాటి బంధం అని చెప్పారు. ఈ వీడియో ద్వారా మోడీ, అదానీ ఒక్కటే అని నిరూపించే ప్రయత్నిం కాంగ్రెస్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్‌ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.

READ MORE:MLC Election Results: పీడీఎఫ్ అభ్యర్థి ఘన విజయం.. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు..!

దీంతో పాటు అదానీ వ్యవహారం, సంభల్‌ హింసాకాండ తదితర అంశాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ.. ఇవాళ సమావేశాలు ప్రారంభానికి ముందు పార్లమెంట్‌ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అయితే, ఈ నిరసనలకు తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు హాజరుకాకపోవడం గమనార్హం.

Exit mobile version