రేపు హర్యానా రాష్ట్రంలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర చేపట్టనున్నారు. గతంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘటన వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో పోలీసులు కూడా మృతి చెందారు. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాత్ర సమయంలో నుహ్ జిల్లాలో 24 గంటల పాటు ఇంటర్నెట్ మరియు బల్క్ ఎస్ఎమ్ఎస్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వల ప్రకారం.. నుహ్ జిల్లాలో జులై 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 22 సాయంత్రం 6 గంటల వరకు వర్తిస్తుంది. తప్పుడు వదంతులు వ్యాపించి శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధ్వంసకర అంశాలను వ్యాప్తి చేయడానికి ఇంటర్నెట్ సేవలను దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. నూహ్‌లోని ప్రజా ఆస్తులు మరియు సౌకర్యాలకు నష్టం వాటిల్లకుండా నిరోధించడానికి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు హర్యానా డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత తెలిపారు.
READ MORE: Heavy Floods: ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి.. గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం
ఇది కాకుండా.. మొబైల్ ఇంటర్నెట్ సేవల ద్వారా వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ మొదలైన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. గతంలో ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయడం ద్వారా హింసాత్మక కార్యకలాపాలు చోటుచేసుకుటున్నాయి. చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌలభ్యం, ప్రాథమిక గృహావసరాల మేరకు వ్యక్తిగత ఎస్ఎమ్ఎస్ , మొబైల్ రీఛార్జ్, బ్యాంకింగ్ ఎస్ఎమ్ఎస్, వాయిస్ కాల్స్, కార్పొరేట్, దేశీయ బ్రాడ్‌బ్యాండ్, అద్దె లైన్ల ద్వారా అందించే ఇంటర్నెట్ సేవలకు మినహాయింపు ఇచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్గత తెలిపారు.
READ MORE: TCS Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..టీసీఎస్ లో భారీగా ఉద్యోగాలు
యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నూహ్ పోలీసులు తెలిపారు. గత ఏడాది జులై 31న హర్యానాలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును పలువురు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఇద్దరు హోంగార్డులు మృతి చెందగా.. కనీసం 15 మంది గాయపడ్డారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర సందర్భంగా జనం రాళ్లు రువ్వడంతో పాటు కార్లకు నిప్పు పెట్టారు. అదే రాత్రి.. గురుగ్రామ్‌లోని ఒక మసీదుపై ఒక గుంపు దాడి చేసింది. ఈ ఘర్షణ తర్వాత అల్లర్లు చెలరేగాయి. దీంతో 5 మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో మతం పేరుతో కొందరు వికృత చేష్టలు పరస్పర సామరస్యానికి భంగం వాటిల్లకుండా చూసేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. అక్రమాస్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు. ఇందుకోసం డ్రోన్ల సాయం కూడా తీసుకోనున్నారు.